ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

RAVVA DOSA

రవ్వ దోశ

కావాల్సినవి:
బొంబాయి రవ్వ- ఒక కప్పు
బియ్యప్పిండి - ఒక కప్పు
మైదా పిండి- అర కప్పు
పుల్లటి మజ్జిగ- ఒక గ్లాస్
అల్లం- పక చిన్న ముక్క
పచ్చిమిర్చి- ఐదు
జీలకర్ర- 2 టీ స్పూన్లు
నూనె- 50 గ్రా
ఉప్పు- తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా బొంబాయి రవ్వ,మైదా పిండి,బియ్యప్పిండి లను శుభ్రంగా జల్లించి పెట్టుకోవాలి.తరువాత ఈ మూడింటిని పుల్లటి మజ్జిగలో వేసి బాగా కలుపుకొని కొంత సమయం నాననివ్వాలి.
2 ) తరువాత ఇందులో ఉప్పు కలుపుకుని బాగా కాలిన పెనంఫై దోశలు పోసుకుని వాటి ఫై జీలకర్ర,సన్నగా తరిగిన అల్లం ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వెయ్యాలి. ఒక వైపుబాగా వేగిన తరువాత రెండో వైపు కూడా బాగా వేగనిచ్చి దోశ ను తీసుకోవాలి.అంతేవేడి వేడి రవ్వ దోశలు రెడీ... ,ఇవి కొబ్బరి చట్నీ తో బావుంటాయి....