సబ్జీ గోస్ట్
కావాల్సినవి:
మటన్- 500 గ్రా
పాలకూర- 10 కట్టలు
నూనె- 70 మీ.లీ
అల్లంవెల్లుల్లి- 30 గ్రా
కారం- 15 గ్రా
పసుపు- 5 గ్రా
టమోటాలు- 200 గ్రా
గరంమసాలా -5 గ్రా
మెంతి కూర-4 కట్టలు
ఉల్లిపాయలు- 100 గ్రా
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1 ) ముందుగా ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేసాక,బాగా కడిగి తరిగిన మెంతికూరను వేసి ఫ్రై చేసాక,అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి ఎర్రగా ఫ్రైచేయండి.తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద,కారం,పసుపు వేసి అందులోనే కడిగి శుభ్రం చేసిన మటన్ ను వేసి బాగా కలియబెట్టండి.తరువాత తగినంత ఉప్పు కూడా చేర్చి మూత పెట్టి ఉడికించండి.
2 ) మటన్ ఉడుకుతుండగా అవసరమైతే కొన్ని నీళ్లు చల్లండి. మాంసం ఉడకగానే శుభ్రంగా కడిగి తరిగిన పాలకూరను,టమోటా ముక్కల్ని కూడా వేసి కలియబెట్టి బాగా ఉడికించండి. దాంతో పాలకూర కూడా ఉడికి సబ్జీ గోస్ట్ తయారు అవుతుంది.దించే ముందు గరం మసాలా చల్లి,వేడిగా పులావ్ తో గాని,వైట్ రైస్ తోగాని వడ్డించండి.