ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

RAVVA KAZZIKAYALU

రవ్వ కజ్జికాయలు

కావాల్సినవి:
మైదా పిండి-అర కేజీ
నెయ్యి- 50 గ్రా
ఉప్పు-చిటికెడు
నూనె-వేయించడానికి సరిపడా
పూర్ణం కోసం
నెయ్యి - 50 గ్రాb
బొంబాయి రవ్వ- 300 గ్రా
పంచదార- 400 గ్రా
కొబ్బరి తురుము- 100 గ్రా
యాలకులు- 5గ్రా
తయారు చేసే విధానం:
1) బొంబాయి రవ్వ,నెయ్యి కలిపి దొర గా వేయించి,అందులో పంచదార పొడి,వేయించిన కొబ్బరి తురుము,యాలకుల పొడి కలిపి పక్కన వుంచండి.
2)మైదాను జల్లించి -ఉప్పు,నెయ్యి కలపండి.దీన్ని నీళ్ళతో తడిపి గట్టి ముద్దలా చేసి పది నిమిషాలు సేపు వస్త్రాన్ని కప్పండి.తరువాత చిన్న చిన్న ఉండలు గా చేసి పూరీలు వత్తండి.దీని మద్య లో రెండు చెంచాల పూర్ణం మిశ్రమాన్ని ఉంచి రెండు అంచులూ దగ్గరకు చేర్చి గోరంచుగా మడత పెట్టండి.ఇలా చేసిన వాటిని నూనె లో దొరగా వేయిస్తే రవ్వ కజ్జికాయలు సిద్ధం...