ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CHICKEN LOLLYPOP

చికెన్ లాలీపాప్

కావాల్సినవి:
చికెన్ రెక్కలు-ఎనిమిది
ఎండుమిర్చి-నాలుగు
అల్లంవెల్లుల్లి-అర టీ స్పూన్
గరం మసాలా-చిటికెడు
కోడి గుడ్డు సొన- 2టీ స్పూన్లు
సెనగపిండి- 2టీ స్పూన్లు
ఉప్పు-తగినంత
నిమ్మరసం-ఒక టీ స్పూన్
ఆరెంజ్ కలర్ -చిటికెడు
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం :
1)ముందుగా ఒక చికెన్ రెక్కను తీసుకుని దాన్ని వెనక్కి తిప్పి-జాయింట్ మద్య లో విరవండి.ఇలా చేయడం వల్ల,రెండు ఎముకల చివర్లు బయటకు వస్తాయి.వాటిలోనుండి సన్నటి ఎముకల్ని బయటకు లాగి తీసేయండి.చివరకు పెద్ద ఎముక మిగులుతుంది.దాన్ని పట్టి వున్న మాంసాన్ని ముద్దలా చేసి-ఎముక చివరకు చేర్చండి.ఇలా మిగిలిన చికెన్ రెక్కల్ని లాలీపాప్ ల మాదిరిగా సిదం చేసుకోండి.
2)ఈ ఎముకలను పట్టిన మాంసానికి పైన చెప్పిన మసాలాల్ని పట్టించి అరగంట సేపు ఉంచండి.
3)బాణలి లో మరుగుతున్న నూనె లో వీటిని ఎర్ర గా వేయించండి.తయారైన చికెన్ లాలిపాప్ లను అతిధులకు వేడి వేడి స్నాక్స్ గా అందించండి........