ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

VEG VADA

వెజ్ వడలు

కావాల్సినవి:
సెనగపప్పు- 50 గ్రా
మినపప్పు- 50 గ్రా
పెసరపప్పు-50 గ్రా
పచ్చిమిర్చి-పది
అల్లం-చిన్నముక్క
క్యాబేజీ -100 గ్రా
పచ్చి బఠానీ - 25 గ్రా
కాలీఫ్లవర్ -చిన్న ముక్క
ఉల్లిపాయలు-రెండు
కరివేపాకు-ఒక కట్ట
ఉప్పు-తగినంత
నూనె-వేయించందానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) సెనగపప్పు,మినపప్పు,పెసరపప్పులను కలిపి శుభ్రంగా కడగండి.వీటిని రెండుగంటల సేపు నానబెట్టండి.నీళ్లు వార్చి సగం పప్పును తీసుకుని రుబ్బండి.
2 ) మిగిలిన సగం పప్పులో అల్లం,పచ్చిమిర్చి,ఉల్లిపాయముక్కలు ,కూరగాయముక్కలు,పచ్చి బఠానీ ,కొత్తిమీర, కరివేపాకు కలపండి.ఈ మిశ్రమాన్ని రుబ్బిన పిండి లో కలుపుకోవాలి.ఆ పైన ఉప్పు చేర్చండి.
3 ) నూనె బాగా కాగిన తరువాత ఈ పిండిని వడలుగా చేసుకొని దోరగా వేయించండి.వెజ్ వడలు రెడీ........