ఆలు బైగన్ కర్రీ
కావాల్సినవి:
వంకాయలు- 250 గ్రా
బంగాళా దుంపలు- 250 గ్రా
ఉల్లిపాయలు-60 గ్రా
పచ్చిమిర్చి-నాలుగు
అల్లంవెల్లుల్లి-ఒక టీ స్పూన్
కారం-ఒకటిన్నర టీ స్పూన్
జీలకర్ర పొడి-పావు టీ స్పూన్
ధనియాల పొడి-అర టీ స్పూన్
పసుపు-చిటికెడు
టమోటాలు-నాలుగు
ఉప్పు-తగినంత
నూనె- 50 గ్రా
తయారు చేసే విధానం:
1) తెల్ల వంకాయలు,బంగాల దుంపలను ముక్కలు గా తరిగి ఉప్పు నీటిలో వేయండి.
2 ) ఒక గిన్నెలో నూనె పోసి కాచాక-సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని సన్నటి సెగమీద వేయించండి.ఆ తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద ,కారం,ధనియాలు,జీలకర్ర పొడి తో పాటు పసుపు వేసి కాయగూరముక్కల్ని కూడా కలిపి వేయించండి.ముక్కల్లో నీరు ఇంకిపోతే గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించండి.
3) కూర ఉడికిన తరువాత టమోటాలని ,తరిగిన కొత్తిమీర వేసి కాసేపు ఉడికించితరువాత దించాలి.దీనిని రైస్ తో వడ్డిస్తే బావుంటుంది.