ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ANOTHER SPECIAL FESTIVAL ALTERNATE DISH FRIED RICE WITH MANGO


మ్యాంగో ఫ్రైడ్ రైస్

కావలసిన పదార్ధాలు:
అన్నం: 4cups
మామిడి తురుము: 2cups
కొబ్బరి తురుము: 2cups
మొలకెత్తిన పెసళ్లు: 2cups
మినపప్పు: 3tsp
నువ్వులు: 3tsp
కొత్తిమీర తరుగు: 3tsp
జీడిపప్పు: 50grms
శెనగపప్పు: 2tsp
మినప్పప్పు: 2tsp
పోపుదినుసులు: 2tsp
పసుపు: 1/4tsp
ఆయిల్: తగినంత
ఉప్పు రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదటగా నువ్వులు, మినప్పప్పులను వేయించి పొడిచేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పొడి పొడిగా వార్చిన అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలియబెట్టాలి.
3. తర్వాత మొలకెత్తిన పెసళ్లను ఉడికించి ఉంచి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు బాణలిలో కాస్త నూనె వేసి జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి.
5 అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, పెసళ్లను వేసి మరికాసేపు వేయించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. చివర్లో కొత్తిమీర తరుగు పైన చల్లాలి. అంతే రుచికరమైన మ్యాంగో ఫ్రైడ్‌రైస్ రెడీ.