జుట్టు తెల్లబడుతోందా..!
మామూలుగా కొంత వయసు వచ్చాక జుట్టు తెల్లబడటం అనేది ఎవరికైనా సహజమే. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా జుట్టు త్వరగా తెల్లబడిపోతోంది. ఇలాంటప్పుడు కొంచెం ఆలోచించి నివారణ ఉపాయాలు వెతకాలి. మీకు టీ, కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటే తగ్గించండి. అంతేకాదు మసాలాలు, కూడా మానేయండి. ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే బాలనెరుపు సమస్య నుండి బయటపడవచ్చు.
తలస్నానానికి వీలెైనంతవరకు కుంకుడుకాయలు, శీకాయి, హెర్బల్ షాంపూలనే వాడాలి. ఒక స్పూన్ కర్పూరం పొడిని కొబ్బరినూనెలో కలుపుకుని ప్రతిరోజీ మసాజ్ చేసుకోవాలి. జుట్టును తరచు నూనెతో మసాజ్ చేయడం చాలా అవసరం, వారానికి రెండుసార్లు ఆముదం కాని కొబ్బరినూనె కాని గోరువెచ్చగా వేడి చేసి తలకు బాగా మసాజ్ చేయండి. గంట తరువాత తలస్నానం చేయండి. తలస్నానం తరువాత చేతివేళ్లతో తలంతా మసాజ్ చేస్తే రక్తపస్రారం పెరిగి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. మల్లెతీగ వేళ్లను నిమ్మరసం కలిపిగ్రెైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత కడిగేయాలి. కొత్తిమీర రసం జుట్టుకు నిగారింపునిస్తుంది. కాఫీ లేదా టీ డికాషన్‌లో గోరింటాకు వేసి నానపెట్టి, తల కు పట్టించి గంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. మెంతిపిండి గోరింటాకు, పెరుగు కలిపి పెట్టుకున్నా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.