ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CURRY WITH TOMATO ADDING SOUTH INDIAN MASALA -GARAM GARAM CURRY


టొమోటో మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు:
టొమోటోలు: 1/2kg
నూనె: కావలసినంత
గసగసాలు: 2tsp
జీడిపప్పులు: 20
నువ్వులు: 2tsp
చింతపండు: నిమ్మకాయలంత
ఉల్లిపాయలు: 4
ఉప్పు, కారం: తగినంత
పసుపు: 1/2tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tsp
మసాలాపౌడర్: 2tsp
కొత్తిమీర: 1cup
తయారు చేయు విధానం:
1. ఒక టీస్పూన్ నూనెలో గసగసాలు, రెండు ఉల్లిపాయల తరుగు, జీడిపప్పు, నువ్వులు వేసి దోరగా వేయించాలి.
2. చల్లారిన తరువాత ముందే నానబెట్టి ఉంచిన చింతపండు, ఉప్పు, కారం జతచేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. స్టవ్‌పై పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి రెండు ఉల్లిపాయల తరుగు వేసి దోరగా వేయించాలి. తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగి ఉంచుకున్న టొమోటో ముక్కల్ని వేసి వేయించాలి.
4. కాసేపటి తరువాత ముందే నూరి ఉంచుకున్న మసాలాను వేసి బాగా కలిపి పది నిమిషాలపాటు ఉడికించాలి. దించేముందు మసాలాపొడి వేసి కలిపి. పైన కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. అంతేటొమోటో మసాలా కర్రీ రెడీ.