ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FESTIVAL SPECIAL SWEET - MANGO BURFI


మ్యాంగో బర్ఫీ

కావలసిన పదార్ధాలు:
మామిడి ముక్కలు: 250 gms
పంచదార పొడి: 250 gms
కోవా: 250 gms
యాలకుల పొడి: 1/2tsp
చిరోన్జీ: 2tbsp
పిస్తా (చిన్న ముక్కలుగా కట్ చేసినవి): 4tsp
టుట్టి-ఫ్రూటి కట్ చేసినవి: 2tsp
ఆరంజ్ కలర్: కావలసినంత
తయారు చేయు విధానము:
1. మొదటగా బౌల్ తీసుకొని అందులో మామిడికాయ ముక్కలు మరియు సగభాగం పంచదార పౌడర్ వేసి బాగా కలపాలి.
2. తర్వాత పాన్ లో వేసి స్టౌ మీద వుంచి మీడియం హీట్ టో ఉడికించాలి. 1కప్పు మామిడిముక్కలు అరకప్పు వచ్చేవరకూ ఉడికించి ప్రక్కన తీసి పెట్టుకోవాలి.
3. పాన్ లో కోవా వేసి కొద్ది గా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తర్వాత అందులో మిగిలిన పంచదార, ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న మామిడి గుజ్జు వేసి బాగా కలపాలి. ఇది మదువుగా తయారైయ్యే వరకూ తక్కువ మంట మీద ఉడకనివ్వాలి.
4. చిక్కబడే సమయంలో ఆరంజ్ ఫుడ్ కలర్ వేసి కలిపి. ఒక ప్లేట్ కు నెయ్యి రాసి [^] అందులో పోయాలి.
5. కొద్దిసేపు అలాగే ఉంచి చల్లారిన తర్వాత కావలసిన ఆకారంలో కట్ చేసి వాటి మీద యాలకుల పొడి, చిరోన్జీ నట్స్ మరియు పిస్తా వేసి గార్నిష్ చేయాలి అంతే అద్బుతమైన రంగు రుచి కల మ్యాంగో బర్ఫీ రెడీ.