ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GREEN GRAINS ONION POTATO ALL MIXER MUTTER COFTHA CURRY - SPECIAL DISH FOR CHAPPATHI


మట్టర్ కోఫ్తా కర్రీ!

కావలసిన పదార్ధాలు:
పచ్చి బఠానీ: 1/2 kg
సెనగపిండి: 2 tsp
ఉల్లిపాయలు: 50 grm
పచ్చి మిర్చి: 6 grm
ఉప్పు: రుచికి తగినంత
కారం: 2 tsp
ధనియాల పొడి: 2 tsp
గరం మసాలా: 1 tsp
పసుపు: 1/4 tsp
బంగాల దుంపలు: 150 grms
నూనె: తగినంత
తయారుచేయు విధానం:
1. మొదటగా పచ్చి బఠానీలు ఉడికించి మిక్సీలో గ్రైండ్ చేయాలి.
2. ఒక పాన్ లో నూనె వేసి కాగాక కొన్ని ఉల్లిపాయముక్కల్ని వేయించాలి. అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, సెనగపిండి వేసి కొద్ది సేపు ఫ్రై చేయాలి. ఆ పైన బఠానీ పేస్ట్ వేసి కలిపి ముద్దలుగా (కోఫ్తాలు) చేసుకొని నూనెలో వేయించాలి.
3. ఒక గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించి, అందులో కారం, ధనియాల పొడి, పసుపు వేయాలి తర్వాత బంగాళా దుంప ముక్కలు కలిపి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. గ్రేవి పూర్తిగా ఉడకనివ్వాలి, తర్వాత ఉప్పు వేయాలి. అందులో ముందు గా వేయించి పెట్టుకున్న కోఫ్తాలు వేసి కదపకుండా కొన్ని నిమిషాలు ఉడికిస్తే మట్టర్ కోఫ్తా కర్రీ రెడీ.