ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARROW VILLAGE - VILLUPURAM - HAVING ANCIENT HISTORY - TEMPLES, FORTS, WATER FALLS, MOSQUES ETC ETC - ALL IN ONE STOP - GREAT HISTORICAL IMPORTANCE PLACE AND BEST HISTORICAL SPOT IN SOUTH INDIA - SITUATED IN TAMILNADU'S SECOND BIG DISTRICT - VILLUPURAM - TIRUCHI-CHENNAI NEARBY PLACE - BIGGEST MOUNTAINS - 3500 KM ABOVE SEA LEVEL - KALRAYAN MOUNTAINS FAMOUS - FORESTS - STATE TOURIST SPOT - MUST VISIT PLACE


విల్లుపురం అందాల విందు
ప్రకృతి సౌందర్యాదిదేవత ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుందా..?! అన్నట్లుండే విల్లుపురం సౌందర్యాన్ని ఎంతసేపు చూసినా తనివితీరదు. తమిళనాడు రాష్ట్రంలో రెండో అతిపెద్ద జిల్లా అయిన విల్లుపురం.. తిరుచ్చి-చెన్నై హైవేలో జిల్లా కేంద్రంగా విరాజిల్లుతోంది. కనువిందు చేసే పచ్చటి కొండలు, చారిత్రాత్మకమైన ప్రాచీన నిర్మాణాలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, కోటలు, రాజమందిరాలు.. ఇలా ఒకటేమిటి, అనేక పర్యాటక ప్రదేశాలను కలిగి ఉన్న ఈ ప్రాంతానికి బస్సు, రెైలు సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాయి.

చూడాల్సినవివే...
Gingeaకల్రాయన్‌ కొండలు ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం, కళ్లకుర్చి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కల్రా యన్‌ కొండల అందాలను చూసి తరించేం దుకు కళ్లకుర్చి నుంచి బస్సులు అందు బాటులో ఉంటాయి. సముద్రమట్టం నుంచి 3,5 00 కిలోమీటర్ల ఎత్తులో ఉండే పశ్చిమ కనుమలలో కొలువు దీరిన కల్రాయన్‌ కొండలు ఊటీని తలపించే చల్లటి వాతావరణం తో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దట్టమైన అడవి, సెలయేళ్ల పరుగులు, వనమూలికావనం, గోముఖీ నది పర్యాటకులను పరవశింపజేస్తు న్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన ఎకో టూరిజం స్పాట్లు కూడా పర్యాటకులకు ప్రకృతిమధ్య ఆహ్లాదం తోపాటు, సేదదీర్చే కేంద్రాలుగా ఉన్నాయి. కల్రాయనైఉ కొండల్లో పలు పాంతాల్లో జలపాతాలు న్నప్పటికీ, వాటిలో కొన్నింటిలో మాత్రమే స్నానాలు చేసేందుకు వీలవుతుంది.

జింజికోట...
విజయనగర పాలకులు నెల్లూరును పరిపాలించిన కాలంలో మూడు కొండలపెై నిర్మితమైన ఈ జింజికో టను... రాజధానిగా చేసుకుని పాలించారు. కృష్ణగిరి, చక్కిలిదుర్గ, రాజగిరి అనే కొం డలు ముక్కోణం ఆకారంలో వెలిశాయి. వాటిపెై జింజికోటను అద్భుత శిల్పకళా నెైపుణ్యంతో నిర్మించారు. ఈ కోటలో ఇండో-ఇస్లామిక్‌ రీతిలో నిర్మించిన కళ్యాణ మండపం విశేషంగా ఆకట్టుకుంటుంది. కోట ముఖద్వారం వద్ద నిర్మించిన వేణుగో పాల స్వామి ఆలయం నేటికీ పూజలందుకుంటోంది. హనుమాన్‌ ఆలయం, రంగనాథ్‌ దేవాలయం, ఉల్లాఖాన్‌ మసీదు, కమలకన్ని ఆలయాలను మొగల్‌ చక్రవర్తులు, విజయనగరరాజులు ఇక్కడ నిర్మించారు. 1012 లో రాజేంద్రచోళుడు నిర్మించిన రామనాథ ఈశ్వరాలయం, బ్రహ్మ ఇస్లాం ఆలయంగా ప్రసిద్ధి చెందింది. విల్లుపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువాక్కరెైలోని నేషనల్‌ జియోలాజికల్‌ పార్క్‌ చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. 

ఈ పార్కు వేలాది రకాల చెట్లతో అందరినీ ఆకర్షిస్తోంది. దీనికి దగ్గర్లోనే చోళ చక్రవర్తుల పాలనలో సెంబియాన్‌ మహదేవర్‌ అనే మహారాణి శివాలయాన్ని నిర్మించారు. శ్రీ చంద్రమౌళీశ్వరుడు తనాంబిక తీరంలో శ్రీ వక్రలింగేశ్వరుడు, వక్రకాళి అమ్మవారితో కొలువుదీరారు. రాయలవారు దానమిచ్చారట..! విల్లుపురంలో సుమారు 600 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన కల్రాయన్‌ కొండ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కాంచీపురం నుంచి వలస వచ్చిన కర్లర్‌ అనే గిరిజన తెగవారికి దానంగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. రాయ లవారి హయాంలో నిర్మించిన కట్టడాలు అనేకం నేటికీ విల్లుపు రంలో దర్శనమిస్తుండటం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.

పెరియార్‌ జలపాతం...
గోముఖీ డ్యాం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న పెరియార్‌ జలపాతం పర్యాటకులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. గోముఖీ డ్యాం-కరియలూర్‌కు బస్సుమార్గంలో వెళితో ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. రోడ్డుపక్కనే ఉన్న ఈ జలపా తంలో జలకాలాడవచ్చు కూడా. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కరియలూర్‌ ఉంటుంది. పెరియార్‌ జలపాతం నుంచి కరియలూరుకు వెళ్లే మార్గంలో పచ్చని కొండ ప్రాంతాలు కను విందు చేస్తాయి. ఇక్కడ పర్యాటకుల కోసం విడిది గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పెరియార్‌ జలపాతం నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వెల్లిమలెైకి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో ఐదు కిలోమీటర్ల దూరం వెళితే సంవత్సరమంతా పుష్కళంగా నీరు లభించే జలపాతం దర్శించవచ్చు.