అహో... హళేబీడు
హళేబీడు, బేలూరుల మధ్య దూరంలో సుమారు ఇరవెై నిమిషాలు వుంటుంది . హాళేబీడు చిన్న పల్లె. దీనిపేరు ద్వారసముద్రం. వంశపు రాజులు ముఖ్యపట్టణం. ఇప్పటికి హళేబీడు హసన్‌కు మధ్యవున్న మార్గంలో ఆనాటి కోట యొక్క శిథిలాలు కనిపిస్తాయి. కన్నడ భాషలో ‘హళె’ అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత పట్టణం.
హళేబీడులోని ఆలయం విశాల మైదానంలో వుంది. బయట వున్న ప్రాకారం నుంచి లోపల వంద గజాల దూరంలో ఆలయం వుంటుంది. ప్రాకారం దాటి లోపలవున్న ఆలయం దగ్గరకు వెళ్ళడానికి ముందే ఎడమ చేతి వెైపున ఒక యాభెై గజాల దూరంలో చిన్న భవనం పురాత్తవశాఖ వారి ఆఫీసు ఉంటుంది. బేలూరు ఆలయంలాగే ఈ హోళేబీడు ఆలయం కూడా ఆరడుగుల ఎత్తువున్న విశాలమైన వేదికమీద నిర్మించబడింది. ఆలయం మొత్తం అరవెైనాలుగు కోణాలు కలిగి ఉంటుంది. గోడల కింద చుట్టూ వరసగా వివిధ రకాల జంతువులు నాట్యం చేస్తున్న గణేశుడు, తాండవం చేస్తున్న శివుడు, కైలాస పర్వతాన్ని పెైకి ఎత్తాలనుకుంటున్న రావణుడు, ఐరావతం మీద స్వారీ చేస్తూవున్న దేవేంద్రుడు, హంసవాహనం మీద వున్న బ్రహ్మదేవుడు, నాట్య సరస్వతి, దశావతారాలకు సంబంధించిన ఘట్టాలు, శ్రీరాముడు ఒకే బాణంతో ఏడుతాటిచెట్లను పడగొట్టడం, తన తలపెైగా విల్లు ఎక్కుపెట్టి వున్న అర్జనుడు, చిన్ని కృష్ణుని అల్లరి పనులు.
ఈ విధంగా ఎన్నో చిత్ర విచిత్రములెైన శిల్పాలు పురాణగాథలను తెలిపే శిల్పాలు ఎన్నో వున్నాయి. ఆలయం లోపల శాంతలేశ్వర స్వామి వున్న గర్భగుడి ద్వారానికి రెండుపక్కలా రెండు ద్వారపాల కుల విగ్రహాలున్నాయి. ఇది ఒక్కొక్కటి ఒకేరాతి ముక్కలో చెక్కి నల్లసీసపు రాతి విగ్రహాలు వీటి యొక్క నగిషీ పని ఎంతో అద్భుతంగా వుంటుంది. నదురు మధ్య అగ్గపుల్ల దూరేటంత ఖాళీ వుంచి కిరీటపు సన్నని అంచుకు అతి సూక్ష్మమైన సగిషీ చెక్కారు. ఇది చూస్తే ఇక్కడి శిల్పాలలోని పనితనం, నేర్పు అర్థం అవుతాయి.లోపలవున్న రెండు ఆలయాలకు ఎదురుగా వేరుగా వున్న ఒక్క మండపంలో రెండు నంది విగ్రహాలు వున్నాయి. భారతదేశంలో వున్న నంది విగ్రహాగాలన్నిటిలోనూ, పరిమాణపు లెక్కను బట్టి ఇది అయిదు, ఆరు స్థానాలలో వున్నాయి. ఇందులో ఒకటి కొంచెం పెద్దది.
రెండవది చిన్నది. వీటిని నిశితంగా చూస్తే శివుని తాండవ నృత్యం ఏకాక్రగతతో వింటున్నట్లు రిక్కించి వున్న చెవులు, ఆ నృత్యంలోని వీర రసానికి కలిగే ఆవేశపు అనుభూతికి గుర్తుగా వెడల్పుగా సాగిన ముక్కు పుటాలు తనూ వేచి నృత్యం చేయాలి అనే ఉత్సాహం కలుగుతుండగా, తీక్షణంగా వున్న కళ్ళు, నేలకు తన్ని పట్టి పెైకి లేవడానికి సిద్ధపడుతూ వున్న కాలి గిట్టలు చూస్తే శిల్పకారుడి ఊహాశక్తికి నేర్పరితనానికి జోహారులు అర్పించాలి. ఆలయానికి అవతల పక్క విశాలమైన బయట ప్రదేశంలో శిథిలమైన అనేక శిల్పాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. ఆలయానికి కుడివెైపు మూలగా పురాతత్వశాఖవారి ఆఫీసులో మ్యూజియం వుంది. విరిగిన శిల్పాలను అక్కడ భద్రపరిచారు. విష్ణువర్ధన చక్రవర్తి యొక్క సేనాధిపతి కేతుమల్లుడు అనే ఆయన క్రీశ 1121 సంలో ఆలయం నిర్మాణం ప్రారంభించాడు.
ఇది పూర్తి అవడానికి 105 సంలు పట్టింది. ‘‘శిల్ప నిర్మాణంలోని ఊహాశక్తికి, నేర్పరితనానికి చాతుర్యానికి హోళేబీడు ఆలయానికి సాటి మరొకటి లేదు’’. ఇది విదేశీ శిల్ప పండితుల అభిప్రాయం. భారతీయ శిల్పుల ఔన్నత్యం నెైపుణ్యం ఎంత అద్వితీయమైనవో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు. ఈ ఆలయాన్ని తప్పక చూడవలసిందే.