ఇంటిని అందంగా అలంకరించాలంటే?
ఇంటిని అందంగా అలంకరించడంలో ఓ ప్రత్యేకత ఉండాలి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే… ఇంటి బయటి గోడపై మెట్ ఫినిషింగ్ ఇచ్చి దానిపై చెక్కతో తయారు చేసినట్లు పెయింటింగ్ వేయండి. దీంతో మీ ఇంటికి కొత్త అందం వస్తుంది. ఆ గోడ చెక్కతో చేసిందేనా అనే అనుమానం రాక మానదు.మీ ఇంటి ఆవరణలో లేదా లాన్‌లో బోదతో ఓ చిన్న గుడిసె ఏర్పాటు చేసుకోండి. దీంతో మీరు పల్లెల్లో నివసించిన అనుభూతి కలుగుతుంది.ఇంటికి తోరణాలుగా కృత్రిమంగా కాకుండా ప్రకృతి పరమైన మామిడి ఆకులను కట్టి ఉంచండి. దీంతో నిత్యం మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందా అనే భావన కలుగుతుంది. ఇలా నిత్యం ఇంటికి తోరణాలు కడుతుంటే ఆ ఇల్లు సుఖ-శాంతులతో విరాజిల్లుతుంది.మీ ఇంటి బాల్కనీలో ఓ అందమైన ఊయలను ఏర్పాటు చేయండి. అది మీ ఇంటికే ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. డ్రాయింగ్ రూంలో మట్టితో తయారు చేసిన పాత్రలతో అలంకరించండి. వీలైతే ఇంట్లో లాంతర్ (లాల్‌టెన్) ను వ్రేలాడదీయండి. ఓ ప్రత్యేకమైన అందం వస్తుంది.