ఇంటి తలుపులపై ప్రత్యేక దృష్టి సారించండి
కొత్తగా ఇల్లు కట్టించేవారు తమ తలుపులకు ఏయే రంగులు వాడాలో తెగ ఆలోచిస్తుంటారు. రంగులకు బదులుగా డిజైన్లను ఏర్పాటు చేస్తే అది మరింతగా ఆకట్టుకుంటాయి. దీనికి చేయవలసిందేంటంటే…
ఇంటికి వాడే తలుపులపై వివిధ రకాల డిజైన్లను మీరు రూపొందించుకోవచ్చు. తలుపుల మీద మీ పేర్లనే కాదు… మీకు నచ్చిన బొమ్మలను కూడా డిజైన్ చేయించుకోండి.
ఇంటి సింహ ద్వారానికున్న తలుపుకు మీ పేరును చెక్కించుకోండి లేదా నేమ్ ప్లేట్ చేయించి దానిని తలుపులోనే ఇమిడేటట్లు చూడండి. పూజ గదికి మీ కిష్టమైన దేవుని ప్రతిమ, పిల్లల గదికి కార్టూన్లు కలిగిన బొమ్మలను చెక్కించండి. వంట గదికి కూరగాయలు లేదా పండ్లు కలిగిన డిజైన్‌తో కూడుకున్న బొమ్మలను చెక్కించుకోండి.
ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు మీరు వాడే కొయ్య ఒకే రకానికి చెందినదై ఉండేలా చూసుకోండి. వీటితో పాటు గ్లాస్ కాంబినేషన్ ఉంటే ఇంటికి మరింత అందం ఒనగూరుతుందంటున్నారు ఇంటీరియర్ డెకొరేటర్స్.