ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MAA TELUGU THALLI TELUGU SONG


జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ

మా తెలుగు తల్లి కూర్పులోని  మరో దేశభక్తి గీతం  -
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు దుగ్గిరాల వారి స్వర కల్పనలో ఆలపించారు. మీరూ ఆలకించండి.


 జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి  [[ జయ జయ ]]

జయ జయ సస్యామల సుశ్యామచలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా  [[ జయ జయ ]]

జయ దిశాంత గతశకుంత దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పథ విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా   [[ జయ జయ ]]

గమనిక : మిత్రులు ' తెలుగు పద్యం ' బ్లాగు భైరవభట్ల కామేశ్వరరావు గారు పంపిన సమాచారం -

ఈ పాట (సంస్కృతం కదా) అర్థం కావలిస్తే ఇక్కడ చదువుకోవచ్చు:
http://groups.google.com/group/telugu-unicode/browse_thread/thread/488ec5e8ade49ee9?fwc=1pli=1