ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MASALA CHILLI CAPSICUM PEPPER


మసాలా బెల్ పెప్పర్

కావలసిన పదార్దాలు:
బెల్ పెప్పెర్(క్యాప్సికమ్)
(గ్రీన్, పర్పుల్, రెడ్, ఎల్లో) – 4
పొటాటో (ఉర్ల గడ్డ) – 1
ఉప్పు – రుచికి సరిపడా
కారం – 2 tsp
దనియా – 2 tsp
పసుపు – 1 tsp
వేయించిన పల్లీలు(వేరుశేనగ పప్పు)-1/4 cup
నిమ్మ రసం – 1 tsp
కొబ్బరి తురుము – 2 tsp
ఆవాలు – 1 tsp
జిలకర్ర – 1 tsp
ఆయిల్ – 2 tbsp
తయారు చేసే విధానము:
1. ముందుగా స్టౌ వెలిగించి పల్లీలు(వేరుశెనగ పప్పు)ను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్(నాలుగు కలర్స్) ను మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అలాగా పొటాటోను చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జిలకర్ర వేసి చిటపటలాడకా పొటాటో ముక్కలను అందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసి మూత పెట్టి ఉడకనివ్వాలి.
3. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి, ఇప్పుడు కొద్దిగా కారం, దనియాల పొడి వేసి, గరం మసాలా వేసి మరికొద్ది సేపు ప్రై చేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
4. ఇప్పుడు కొబ్బరి తురుము, పల్లీలు(వేరుశెనగ పప్పు) పొడి మెల్లిమెల్లిగా చల్లి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరగా నిమ్మరసం జత చేసి కలియబెట్టాలి అంతే మసాలా బెల్ పెప్పర్ రెడీ. ఇది చపాతీ, పూరీ, పరోటా లలోకి చాలా రుచిగా ఉంటుంది.