బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై
బాయిల్డ్ ఎగ్స్ తో చేసే ఈజీ కూర ఇది.ఉల్లిపాయలు,గుడ్లు ఉంటే చాలు
ఈ కూర రెడీ అయిపోతుంది.అన్నంలోకి,చపాతీలోకి కూడా
బావుంటుంది.
ఈ కూర రెడీ అయిపోతుంది.అన్నంలోకి,చపాతీలోకి కూడా
బావుంటుంది.
కావలసిన పదార్ధాలు:
ఎగ్స్ రెండు
ఉల్లిపాయలు రెండు పెద్దవి
మిర్చి రెండు
అల్లంవెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్
గరం మసాల పొడి అర స్పూన్
ఉప్పు,కారం తగినంత
పసుపు కొంచెం
నూనె మూడు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర కొంచెం
తాలింపుకు శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి
తయారు చేసే విధానం :
నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు,మిర్చి,
కరివేపాకు వేసి సన్నని సెగపై వేయించాలి.
ఉల్లిపాయ బాగా వేగిన తరువాత అల్లంవెలుల్లి పేస్ట్,ఉప్పు,కారం,పసుపు,
ఉడికించిన గుడ్లు వేసి రెండు నిమిషాలు వేయించి గరంమసాల పొడి,
కొత్తిమీర చల్లాలి.
బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉంచి దింపెయ్యాలి.
ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి