పాలక్ - ఎగ్ ఫ్రై
ఎగ్ కర్రీ రెగ్యులర్ గా చేస్తుంటాము ఎవరమైనా.అందులోనే పాలకూర,
మెంతికూర ఇలాంటివి కలిపితే కొత్తరుచితో కూర బావుంటుంది.కొంచెం
వెరైటీగా ఉంటుంది.ఆకుకూరలు ఎక్కువ వాడినట్టు ఉంటుంది.
కావలసిన పదార్ధాలు
ఎగ్స్ మూడు
ఎగ్స్ మూడు
పాలకూర రెండు కట్టలు
ఉల్లిపాయ ఒకటి పెద్దది
మిర్చి రెండు
ఉప్పు,కారం తగినంత
పసుపు కొంచెం
నూనె రెండు టేబుల్ స్పూన్లు
గరంమసాల పొడి అర టీ స్పూన్
శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి.కరివేపాకు
తయారు చేసే విధానం:
తయారు చేసే విధానం:
నూనె వేడి చేసి తాలింపు వేయాలి.
సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి కరివేపాకు వేసి వేయించాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన పాలకూర వేసి చిటికెడు ఉప్పు వేసి నీరంతా
పోయేవరకూ ఉడికించాలి.
పసుపు,కారం,తగినంత ఉప్పు వేసి కలిపి కొంచెం వేయించి, గుడ్లు
కొట్టి ఇందులో వేయాలి.
కొంచెం ఉడికాక ఒకసారి కలిపి గరంమసాలాపొడి చల్లి పొడిపొడిగా
వేయించుకోవాలి.
ఈ కూర అన్నంలోకి,చపాతీ లోకి బావుంటుంది.ఇందులో పాలకూర
బదులు మెంతికూర కూడా వేసి చెయ్యొచ్చు