ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

POTATO SPECIAL CURRY


ఆహా అనిపించే ఆలూ – 65

కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు(పొటాటో): 4
ఉల్లిపాయలు: 2
తియ్యటి పెరుగు: 1/4 cup
పచ్చిమిర్చి: 2
అజినామోటా: 1/2tsp
కారం: 1/2tsp
బేకింగ్ పౌడర్: 1/4tsp
గరం మసాలా: 1/4tsp
శనగపిండి: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: కావలసినంత
తయారు చేయు విధానము:
1. బంగాళాదుంప ముక్కలను ఉడికించి తోలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటికి బేకింగ్ పౌడర్, శనగపిండి, ఉప్పు కలిపి వాటికి పట్టించి పెట్టుకోవాలి.
2. వాటిని వేడినూనెలో ఎర్రగా వేయించి పక్కన ఉంచాలి. పెరుగును ఒక పల్చటి గుడ్డమీద పోసి నీరు పోయేంతవరకు వడకట్టి దానిని చిలికి మెత్తగా చేసి పెట్టుకోవాలి.
3. ఉల్లిపాయను చిన్న కట్ చేసుకొని పాన్ లో రెండు గరిటెల నూనెను వేసి కాగిన తరువాత నిలువుగా కట్ చేసిన మిర్చి, ఉల్లిముక్కలు, అజినమోటాను వేసి ఎర్రగా వేయించాలి తర్వాత దానికి వడకట్టి మెత్తగా చిలికి పెట్టిన పెరుగును కలపాలి.
4. తర్వాత అందులో ఉప్పు, కారం, గరంమసాలా పొడులను చల్లి సన్నని మంటమీద నూనె పైకి తేలేంతవరకూ వేయించాలి.
5. వేగిన తరువాత బంగాళాదుంప ముక్కలను వేసి కొంచెం నీరు పోసి ఉడికించి చివరగా కొత్తిమీర చల్లి పక్కకు దింపుకోవాలి అంతే ఆలూ 65 రెడీ.