ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ZINGER BURFI - SPECIAL HEALTHY SWEET


జింజర్ బర్ఫీ

కావలసిన పదార్థాలు:
అల్లం తురుము: 2 cup
గోంద్: 1 cup(ఇది మార్కెట్టో దొరుకుతుంది)
కొబ్బరి తురుము: 1 cup
జీడిపప్పు: 1/4 cup
బాదం: 1/4 cup
ఎండుద్రాక్ష: 1/4 cup
నెయ్యి: 1/2 cup
బెల్లం: 2 cup
తయారు చేయు విధానము:
1. ముందుగా తాజా అల్లాన్ని ముద్దలా చేసుకోవాలి. దీనిని బాణలిలోకి తీసుకొని తగినన్ని నీళ్లు చేర్చి బాగా ఉడికించాలి.
2. మరో పాత్రలో నెయ్యి వేసి గోంద్, జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్ష, కొబ్బరి తురుమును ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి.
3. బెల్లంను తురిమి కొద్దిగా నీటితో కరిగించాలి. ఇది తీగపాకం వచ్చే సమయంలో అందులో సిద్దం చేసి పెట్టుకున్న మిశ్రమాలన్నింటినీ వేసి సన్ననిమంటపై ఉంచాలి. కొద్దిసేపయ్యాకా మిశ్రమాన్నంతటినీ బాగా కలపాలి. ఇప్పుడు పూర్తిగా గట్టిపడ్డాక ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి వేడిమీదనే కావలసిన ఆకారంలో కట్ చేసి ఆరనివ్వాలి. అంతే అల్లం బర్ఫీ రెడీ