కొబ్బరి పొడితో లడ్డులు చేయడం అందరికి తెలిసిందే. ఆ కొబ్బరి లడ్డూలు కాస్త డిఫరెంటుగా చేద్దాం. చూడడానికి, తినడానికి కూడా బావుంటుంది.
కావలసిన వస్తువులు:
ఎండు కొబ్బరి పొడి – 2 కప్పులు
కండెన్స్ మిల్క్ – 1/2 కప్పు
రోజ్ సిరప్ /రూహ్ అఫ్జా – 1 tsp
యాలకుల పొడి – 1/2 tsp
నెయ్యి – 3 tsp
పాన్ లో నెయ్యి వేడి చేసి కొబ్బరి పొడి, కండెన్స్ మిల్క్, రోజ్ సిరప్, యాలకుల పొడి వేసి కలుపుకుంటూ చిన్న మంట మీద ఉడికించాలి. మిశ్రమం మొత్తం ఉడికి ముద్దగా అయినప్పుడు దింపేసి చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని కొబ్బరి పొడిలో రోల్ చేసుకుని ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెడితే గట్టిపడతాయి. తర్వాత నిలువ చేసుకోవచ్చు..