చర్మ సంరక్షణ...
అందం అన్నాకా కేవలం ముఖం మీదే అందరూ కాన్సన్‌ట్రేషన్ పెడతారు. కానీ నఖశిఖ పర్యంతం జాగ్రత్తలు వహించడంలోనే టోటల్ అందం దాగివుంది. ముందుగా కేశాల సౌందర్యాన్ని కాపాడుకోడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
క్లిన్సింగ్, మాయిశ్చరెైజింగ్ మరియు సన్ ప్రొటెక్షన్ ఈ మూడు చర్మ
క్లిన్సింగ్, మాయిశ్చరెైజింగ్ మరియు సన్ ప్రొటెక్షన్ ఈ మూడు చర్మ
- సౌందర్యాన్ని కాపాడటంలో చాలా ఉపయోగపడతాయి. నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్‌ను పూర్తిగా తొలగించాలి. క్లిన్సింగ్ లోషన్‌తో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఆ తరువాత నాణ్యమైన ఫేష్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మీ చర్మం తత్వాన్ని బట్టి యాంటీఆక్సిండెట్స్ కలిగినటువంటి మాయిశ్చ రెైజర్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారేలా చేస్తుంది.
- కళ్ళు చుట్టు నల్లటి వలయాలు, గీతలు ఏర్పడి కళ్ళు నిర్జీవంగా కనబడుతుంటే స్లైట్లీ స్ట్రాంగర్ యాంటీ ఏజింగ్ క్రీమ్‌ను కళ్ళ చుట్టు అప్లై చేయాలి.
- కాళ్ళు, చేతుల మీదు నూనె గ్రంధులు లేకపోవడంతో చర్మం పొడిబారి ముడతలు వస్తాయి. వయస్సు పెైబడిన వారిలా కనబడేలా చేస్తాయి. చాలా మంది ముఖానికి, జుట్టుకు ఇచ్చినంత ప్రిఫరెన్స్ కాళ్ళకు, చేతులకు ఇవ్వరు. కాబట్టి ముఖానికే కాదు కాళ్లకు, చేతులకు మాయిశ్చరెైజర్ క్రీమ్‌లను ఉపయోగించడం మంచిది