ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SPECIAL BANANA PIECES WITH GARAM NARAM MASALA - SPECIAL BANANA 65


చికెన్ – 65 కాదు బనానా -65

కావలసిన పదార్థాలు :
అరటికాయలు – 2
కార్న్‌ఫ్లోర్ -50 grms
నూనె – తగినంత
మైదా – 25 grm.
పెరుగు – 1 cup
పచ్చిమిర్చి – 4
కరివేపాకు – రెండు రెమ్మలు
కారం – 1 tsp
మిరియాలపొడి – 1/2 tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 tsp
కేసరి కలర్ – 1/2 tsp
గ్రీన్ చిల్లీ సాస్ – 2 tsp
ఉప్పు – రుచికి తగినంత
తయారు చేయు విధానము
1. ముందుగా అరటికాయల్ని తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి.
2. కార్న్ ప్టోర్ లో మైదా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గ్రీన్ చిల్లీసాస్, కేసరి కలర్, కొద్దిగా నీరు పోసి జారుగా కలుపుకోవాలి. గుజ్జులా తయారైన ఈ మిశ్రమాన్ని అరటికాయ ముక్కలకు పట్టించి కొద్దిసేపు ఆరనివ్వాలి.
3. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి బాగా కాగాక అరటికాయ ముక్కల్ని పకోడిల మాదిరిగా వేయించాలి. వేగిన ముక్కల్ని నూనె వార్చి ఉంచుకోవాలి.
4. పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగాక కరివేపాకు, పచ్చిమిర్చి, అరటికాయ ముక్కల్ని వేసి మళ్లీ వేయించి స్పూన్ తో మిశ్రమాన్నంతటిని కలగలిపి దించేయాలి. అంతే అరటికాయ 65 రెడీ.