ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SUGAR PATIENTS SPECIAL DISH - LADDU WITH RAAGI GRAINS - SANKRANTHI FESTIVAL HEALTHY FOOD


రాగి లడ్డు

కావలసిన పదార్ధాలు:
రాగిపిండి: 1cup
బెల్లం తురుము: 1cup
పల్లీలు: 1cup
నెయ్యి: 1cup
జీడిపప్పు: 8
నువ్వులు: 1cup
బాదం పప్పు: 1/2cup
యాలకల పొడి: 1tsp
ద్రాక్ష: 8
తయారు చేయు విధానము:
1. మొదటగా స్టౌవ్ పై కడాయి పెట్టి అందులో విడివిడిగా పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు, రాగి పిండి వేయించి పెట్టుకోవాలి.
2. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకొన్న పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
3. ఈ తర్వాత ఈ మిశ్రమానికి పైన వేయించి పెట్టుకున్న రాగిపిండి కలిపి, దాంతో పాటు ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పు నెయ్యి, యాలకల పొడి వేసి బాగా కలిపి లడ్డుగా చేసుకుని పైన జీడిపప్పు, ద్రాక్షతో గార్నిష్ గా అలంకరిస్తే రాగి లడ్డు రెడీ. (రాగి పిండి మరీ పొడిగా ఉంటే కొద్దిగా పాలు కలిపి లడ్డులా చేసుకోవచ్చు)