తాటి ముంజల్ జ్యూస్
వేసవిలో విరివిగా దొరికి, దాహాన్ని తీర్చే తాటిముంజెలు ఎప్పుడైనా రుచి చూసారా?? వేసవిలో ఎంతో చల్లదనాన్ని ఇచ్చే ఈ ముంజలను సామాన్య మానవుని నుండి ధనికవర్గాల ప్రజలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఓపిగ్గా పైన పొట్టు తీసి మధ్యలో నీరు తాగేసి ముంజలు తినడంలో ఎంతో మజా ఉంటుంది.. అది అనుభవించినవాళ్లకే అర్ధమవుతుంది కూడా.. మరి ఈ ముంజలు అలాగే తినకుండా మంచి జ్యూస్ చేసుకుందాం..
కావలసిన వస్తువులు:
తాటి ముంజెలు – 4
కొబ్బరినీళ్లు – 2 కప్పులు
పంచదార - 3 tsp
ఐస్ – 1/2 కప్పు
తాటి ముంజులు చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పంచదార, ఐసు ముక్కలు, కొబ్బరి నీళ్లు కలిపి మిక్సీలో బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి సర్వ్ చేయాలి. అంతే చల్లటి జ్యూస్ రెడీ.. రెంఢు మూడు పుదీనా ఆకులు వేసుకుంటే రుచి, సువాసన హెచ్చుతుంది..:)