ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU AUNT AND DAUGHTER-IN-LAW POETRY




ఆధునిక అత్తాకోడళ్ళు

అత్తాకోడళ్ల సంబంధం ఎంత గొప్పదో అంత జాగ్రత్తగా నిలబెట్టుకోవలసింది. శ్రీ ఘంటసాల వారు పాడిన అత్తాకోడళ్ళపాట విని అందరూ ఎంతో ఆనంద పడతారు. ఈమధ్య ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఈ ఆధునిక అత్తాకోడళ్ళ పాట విన్నాను. సరిగ్గా ఘంటసాల వారి వరసలోనే పాడారు. నాకు నచ్చి, మీకూ పంచుతున్నాను.



ఘంటసాల వారి పాట..వరుస

అత్తలేని కోడలుత్తమురాలు...ఓయమ్మా..

కోడల్లేని అత్త గుణవంతురాలు..ఆహూ...ఆహూ...



కోడల కోడల కొడుకు పెండ్లామా ఓయమ్మా..

పచ్చి పాల మీద మీగడేదమ్మా...

వేడి పాల ల్లోన వెన్న యేదమ్మా..ఆహూ...ఆహూ...

ఓ అత్త నీ చేత ఆరళ్ళె గాని ఓయమ్మా...

పచ్చి పాల మీద మీగడుంటుందా...

వేడి పాల ల్లోన వెన్న వుంటుందా..ఆహూ..ఆహూ...


ఆధునిక అత్తా కోడళ్ళ పాట

అత్తలేని కోడలు అతి ముద్దరాలు ఓయమ్మా

కోడల్లేని అత్త కడు ధన్యురాలు.....ఆహా.....ఊహూ......


కోడల కోడల కొడుకు పెండ్లామా ఓయమ్మా..

కొత్తగిన్నె ఇట్ల సొట్టలయ్యిందేమే...పట్టుచీర ఇట్ల కర్టెనయ్యిందేమే...



ఓ అత్త నీ చేత ఆరళ్ళె గాని ఓయమ్మా..

గిన్నె కొత్తదికాదు యేండ్ల పాతదమ్మా..

నీ కొడుకు తెచ్చిన చీర కర్టెన్ల వుందమ్మా..ఆహా...ఊహూ...



వడ్డాణం చేయిస్త నడుము కనపడదేమె కోడలా...ఓ కోడలా..

డైటింగు రోజుల్లొ నడుమడగకూడదు..అత్తమ్మ..ఓ.అత్తమ్మా....



మల్లెమాల తెచ్చా జడ వేస్త రావేమే కోడలా...ఓ కోడలా...

కత్తిరించిన జుట్టుకు మాల నిలువదు పోమ్మ అత్తమ్మ..ఓ అత్తమ్మా...



చుట్టు జరీచీర సొంపుగ నేయించ కట్టుకు రావేమె కోడలా..

కంటినిండుగ చూస్త కోడలా..ఓ కోడలా..



చీర కడితె నేను కాలు కదపలేను..

నా డ్రెస్సు నాకుంది నన్నొదిలిపెట్టమ్మ అత్తమ్మ..ఓ అత్తమ్మా..



హాసి నీ అసాధ్యం కూలా...

మినపరొట్టె కాల్చి బల్ల మీదెట్టాను... మాయమయ్యిందేమె కోడలా..

మింగి కూర్చున్నావ కోడలా.. ఓ కోడలా...



మినపరొట్టె అరిగె వయసు కాదు నీది

మంచినీళ్ళు తాగి మంచిగ పడుకోమ్మ అత్తమ్మ..ఓ అత్తమ్మా..



నువ్వంటె నువ్వంటు బదులు చెప్తున్నావు... అమ్మ నేర్పిందేమె కోడలా

మీ అమ్మ నేర్పిందేమె కోడలా....



అమ్మ నేర్పిందంటు ఆడపడుచు చెప్పె.. నువ్వు చెప్పిన మాట అత్తమ్మా..

నేను కాదంటాన అత్తమ్మా..ఓ అత్తమ్మా...



వద్దన్న పని మాని వినయంగ నువ్వుంటె

నీకన్న నాకెవరు..కోడలా..ఎక్కువ ఇంకెవరు కోడలా..ఓ కోడలా..



అనకూడని మాట అనకుండ నువ్వుంటె

నీకన్న నాకెవరు అత్తమ్మా.. ఆప్తులు ఇంకెవరు అత్తమ్మా..ఓ అత్తమ్మా..



అత్త లేక కోడలు అసలుండలేదు ఓయమ్మా...

కోడల్లేక అత్తకు విలువెక్క డుందమ్మా....ఆహా....ఊహూ....