వంటగది శుభ్రతకు కొన్ని చిట్కాలు
మన గృహాల్లో వంటగదికి మనమిచ్చే ప్రాధాన్యమే వేరు. వంటగదిలో ఉపయోగించే ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపే సంగతి తెలిసిందే.వంటగదిని అందంగానూ, పొందిగ్గానూ అమర్చుకోవాలా? మీకోసం కొన్ని చిట్కాలు… వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం అందుబాటులో స్పాంజ్ లాంటి టవల్‌ను ఉపయోగించుకోవాలి.
పెద్ద పెద్ద కబోర్డుల్లో వాడే పాత్రలను ముందుగానూ… ఇంటికి అతిథులొస్తే వాడే పాత్రలను వెనుక పక్కగానూ అందంగా అమర్చుకోవాలి. పేపర్ ప్లేట్‌లు, స్టీల్ ప్లేట్‌లు టవల్స్‌లను ఒకే సెల్ఫ్‌లో చేతికి అందే విధంగా అమర్చుకోండి. రోజు అవసరమయ్యే వస్తువులు అందుబాటులో ఉండేటట్టు సర్దుకోండి. స్నాక్ డబ్బాలను ఉంచుకునేందుకు, ఉప్పులు, పప్పులు వంటివి పెట్టుకోనికి ప్రత్యేకంగా ఓ అలమారిని ఎంచుకోండి.
ఏ డబ్బాలో ఏమున్నాయో చూడగానే తెలిసేలా వాటిపై పేర్లను రాసి లేబుల్‌ను అతికించుకోండి. ఇలా చేస్తే వంటచేసే సమయంలో వెతుక్కోవాల్సి పని తప్పు తుంది. కొందరి గృహాల్లో వందగదిలో స్థలం సరిపోక హాలుల్లో ఫ్రిజ్‌లను ఉంచడం పరిపాటి.
ఇలా ఉంటే వంటకు కావాల్సిన కూరగాయల్ని ఒకే సారిగా ఓ ప్లేట్‌లో గానీ లేదా ప్యాన్‌లో వేసి తెచ్చుకుని తరుక్కోండి. దీనివల్ల పదేపదే ఫ్రిజ్ దగ్గరకు వెళ్లే పని తగ్గుతుంది. వీలైనంతవరకు ఫ్రిజ్‌ను వంటగదిలోనే ఉంచుకోవడం మంచిది. ఇలా ప్రతి పనిని ప్రణాళికతో చేస్తే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మళ్ళీ సర్దుకోడానికి సులువుగా ఉంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది.