ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DECORATE UR DINING TABLES WITH FLOWERS ETC


డైనింగ్ టేబుల్‌పై ఫ్రూట్ బౌల్స్‌తో అలంకరించండి

ఇంట్లోని మీ డైనింగ్ టేబుల్‌పై బ్లూ, ఆకుపచ్చ-ఎరుపు రంగులలో లభ్యమయ్యే బౌల్స్‌లో పండ్లను అమర్చండి. ఇలా వీటిని చూడంగానే ఓ సొఫిస్టికేటెడ్ లుక్ వస్తుంది.నున్నటి గ్లాస్‌వేర్‌తోపాటు మీకు నచ్చిన రంగులలోనున్న బౌల్స్‌లో పండ్లుంచండి. వీటిని చూడంగానే మీ ఇంటికొచ్చిన అతిథులు వాటిపట్ల ఆకర్షితులవుతారు. వెంటనే వాటిని తినేందుకు ఉత్సుకత చూపిస్తారనడంలో సందేహం లేదు. అలాగే వెదురుతో చేసిన బుట్టలను కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిలో పండ్లను ఉంచండి. చూసేందుకు ఇది ప్రత్యేకంగా కనపడుతుంది. పిల్లలకైతే కార్టూన్‌లలోని పాత్రలున్న బొమ్మలతో కూడుకున్న ఫ్రూట్ బౌల్స్ ఉపయోగించండి.ప్రస్తుతం ప్రత్యేకంగా మెటల్‌తో తయారు చేసిన డిజైన్ కలిగిన బౌల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి. ఇలాంటి బౌల్స్‌ కూడా ఉపయోగించవచ్చు.