పాలసంద్రం..!
లక్ష్మీదేవితో వెైకుంఠవాసుడు పాలకడలిలో... శేషశయనం సతి సేవలను పొందాడని మనం పురాణాల్లో విన్నాం. అయితే.. అలాంటి పాలకడలిని భూలోకంలోనే మనం దర్శిస్తే..! ఆశ్చర్యంగా ఉంది కదూ... ఇదీ ముమ్మాటికీ నిజం.. అచ్చంగా అలాంటి పాలకడలిని తలపించే... జలపాతం ఒకటి గోవాలో ఉంది. ఈ పాలకడలి పేరు కూడా ‘దూద్‌సాగర్ ఫాల్స్’ కావడం విశేషం.
పేరుకు తగ్గట్టుగానే... ఈ జలపాతంలోని నీళ్ళు పాలను తలపిస్తాయి. ఎతె్తైన కొండల్లోంచి తెల్లని నురుగు రూపంలో... దుమికే జలధారలకు పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. గోవా, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మండోవీ నదిపెై ఉన్న దూద్‌సాగర్ ఫాల్స్... వర్షాకాలంలో పర్యాటకులను అలరిస్తుంది. ఎందుకంటే... మిగతా కాలాల్లో ఇక్కడ నీటి ప్రవాహం పెద్దగా ఉండదు. గోవా రాజధాని పనజి నుండి ఇక్కడికి కేవలం 60 కిలోమీటర్ల దూరం మాత్రమే . భారత్‌లోనే అత్యంత పేరుప్రఖ్యాతులున్న జలపాతాల్లో దూద్‌సాగర్ ఒకటి. ఎత్తు విషయంలో... దూద్ సాగర్ దేశంలోనే ఐదో పెద్ద జలపాతం కావడం విశేషం. సుమారు 310 అడుగల ఎత్తునుండి దుమికే... జలధార వీక్షణం మాటల్లో వర్ణించలేని అనుభూతి. వర్షాకాలం మొదలెైన తరువాత ఈ జలపాతం ఉధృతి విపరీతంగా పెరుగుతుంది.
ఈ జలపాతం మీదుగా ఓ రెైల్వే బ్రిడ్జి ఉంది. రెైల్లో ప్రయాణిస్తూ... బ్రిడ్జి పెై నుండి దూద్‌సాగర్ అందాలను వీక్షిస్తే... కలిగే అనుభూతి అంతాఇంతా కాదు. దూద్‌సాగర్ చేరుకోవాలంటే.. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కులెమ్ రెైల్వే స్టేషన్ నుండి వెళ్లాలి. ఇక్కడికి బస్సుమార్గం కూడా ఉంది. లోండా, మడ్‌గాఁవ్ రెైల్వేమార్గంలో ఉంది కులెమ్ రెైల్వే స్టేషన్. ఇక్కడికి దగ్గరలోని మిరాజ్ జంక్షన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చే అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రెైళ్ళు ఆగుతాయి. అంతేకాకుండా... వాటర్‌ఫాల్స్ దగ్గర్లో కూడా ఓ చిన్న రెైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ కొన్ని ప్యాసింజర్ రెైళ్ళు అతితక్కువ సమయం పాటు (రెండు నిమిషాలు మాత్రమే) ఆగుతాయి.