తలస్నానంతో చుండ్రుమాయం!
తలమీదజుట్టు మెత్తగా, నున్నగా నిగనిగలాడుతూ ఉండాలి. అందుకని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మనం ఎక్కడెక్కడో తిరిగినప్పుడు దుమ్మూ, ధూళీ, తలపైనపేరుకుపోతుంది. అది పోవడానికి రోజూ తలస్నానం చేయటం మంచిది. రోజూ వీలుకాకపోతే కనీసం వారానికి ఒకసారన్నా తలస్నానం చేయటానికి మంచిది. రోజూ వీలు కాకపోతే కనీసం వారానికి ఒకసారన్నా తలస్నానం చేయాలి. అప్పుడే జుట్టు అందంగా వుంటుంది.మానవులకు ఎన్నో జబ్బులు వస్తూ ఉంటాయి. వాటి అన్నిటిలాగానే జుట్టుకుే కూడా జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ జబ్బుల్లో ఒకటి చుండ్రు. ఇది జుట్టుకు ప్రధాన శత్రువు. చుండ్రు ఉంటే చాలు-తల తరచూ దురద పుడుతూ ఉంటుంది. ఈ దురదను మాన్పుకోవడానికి గీరుతూ ఉండవలసిందే. తలపైన చర్మం ఉన్నది. దానిలోని గ్రంథులు నూనెలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. దానికి దుమ్ము, దూళిల మిశ్రమం తోడయిందనుకోండి చుండ్రు బయలు దేరుతుంది. మొదట కొద్దిగా జిలగా ప్రారంభం అవుతుంది. అదేపెద్ద దురదగా మారుతుంది.ఒక్కోసారి చర్మం పలుచని పొరలు పెచ్చులుగా ఊడిపోతూవుంటుంది. ఇది మాత్రం చుండ్రు కాదు. చుండ్రు పోవడానికి చక్కగా తలస్నానం చేయడం ఒక్కటే మంచి మార్గం. తలస్నానం తోపాటు జుట్టు మాయకుండా చూసుకోవాలి.చుండ్రుఎక్కువైతే అది తగ్గిపోవటానికి డాక్టర్లు కొన్ని మందులు వాడతారు. సల్ఫర్, సలిసిలిక్ యాసిడ్, తారు కలిపిన అయింటుమెంట్లు లేక లోషన్లు అవి.వీటిని రాత్రి పూటతలకు పట్టించాలి. ఉదయాన్నే చక్కగా తల స్నానం చేయాలి. స్నానం చేసి జుట్టును చక్కగా తుడిచి , ఆరబెట్టాలి. దానితో కాస్తన్నా ఉపశమనం కలుగుతుంది.