ప్రశాంత జీవనానికి 25 సూత్రాలు!
1. రోజూ 10-30 నిమిషాల నడక అలవరుచుకోండి. నడిచేటప్పుడు మంచి విషయాలను గుర్తుచేసుకుంటూ చిరునవ్వుతో ముందుకుసాగండి. ఇలా చేస్తే మీకు నిరుత్సాహం నుండి కొంత ఉపశయం లభిస్తుంది.
2 ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మౌనంగా కూర్చోండి.
3. ప్రొద్దున నిద్రలేచిన వెంటనే హడావిడిగా పరుగులు తీయకుండా ఓరెండు నిమిషాలు దేవుని స్మరించుకొని, ఈ రోజు బాగుండాలని కోరుకోండి.
4.చెట్లకు కాసేవాటిని ఎక్కువగా తినడం అలవరుచుకోండి. అంటే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మొదలగునవి.
5.టీ అలవాటున్న వాళ్ళు గ్రీన్ టీనితాగండి. ఎక్కువ మంచి నీళ్ళు తాగడం ఉత్తమం. బ్లూ బెర్రీస్, బ్రాంకోలీ,బాదం వంటివి ఎక్కువ తింటుండండి.
6.ఒక రోజులో కనీసం ముగ్గురినైనా నవ్వించండి.
7.పిచ్చాపాటి మాట్లాడటంలో, గడిచిపోయిన వాటి గురించి ఆలోచించడంలో, బాధపడటం, ఏం చేస్తే ఏం జరుగుతుందో అనే నెగెటివ్‌గా ఆలోచించడంతో మీ బలాన్ని, సమయాన్ని వృధా చేయకండి ఏదైనా మంచిగా, పాజిటివ్‌గా జరిగే విషయాల గురించి ఆలోచించండి. మీ బలాన్ని, సమయాన్ని సద్వినియోగ పరుచుకోండి
.8.ఓ మహారాజు తరహాలో బ్రేక్‌ఫాస్ట్, రాకుమారునిలా లంచ్ మరియు చాలిచాలని డబ్బులున్న స్టూడెంట్‌లా డిన్నర్ చేయండి.
9. జీవితం అద్భుతంగా వుండకపోవచ్చు కాని బాగుంటుందన్న విషయం మరవవద్దు.
10. ద్వేషించేందుకు జీవిత కాలం సరిపోదు కాబట్టి క్షమించడం అలవర్చుకోండి.
11. మీగురించి మీరే అతిగా ఆలోచించకండి. ఎవరు ఎవర్ని పట్టించుకోరు. అంత సమయం ఎవరికీ లేదు. కాబట్టి మీకు నచ్చింది చేయండి. మీకు నచ్చిన విధంగా వుండండి.
12. ప్రతివాదనలో మీరే నెగ్గాల్సిన అవసరం లేదు కనుక కొన్నింటిని ఒప్పుకోవడం మంచిది.
13. పాత జ్ఞాపకాలను మరచిపోయి, ప్రశాంతంగా జీవితాన్ని ఆశ్వాదించడం నేర్చుకోండి. ఇది మీకు కొంత మనోల్లాసాన్ని కలిగిస్తుంది.
14. మీ జీవితాన్ని పక్కవారితోనో, ఇంకొకరితోనో పోల్చుకోవద్దు. వారి పయనం ఎంత వరకో, వారి గమనం ఎంటో మనకు తెలియదు కదా!
15. మీ సంతోషానికి మీరు బాధ్యులు. ఇంకెవరో కాదు అనేవి గుర్తుంచుకోండి!
16. ఏదైనా చెడు ఘటన సంభవించినప్పుడు మిమ్మల్ని మీరే సమర్థించుకోండి. ఓ ఐదేళ్ళ తర్వాత నేటి ఘటన ప్రాధాన్యత ఎంతవరకు అన్నది అలోచించండి.. మీకే అర్థమవుతుంది.
17. అవసరంలో వున్న వారికి మీకు చేతనైన సహాయం చేయండి. విజ్ఞతగా ప్రవర్తించండి.ఎప్పుడూ ఇవ్వడం తప్పతీసుకోవడం అలవర్చుకోవద్దు.
18.మీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారన్న ఆలోచన కూడా మీకు అనవసరంఅన్నది గుర్తుంచుకోండి!
19. అన్నింటికీ సమయమే ఔషధం.
20. ఎంత మంచి స్థితి, లేదా కఠిన పరిస్థితులు ఎదురైనా మీరు మాత్రం మారవద్దు. ఎందుకంటే అవి మారిపోతాయి కాబట్టి.
21. మీకు అవసరమైనప్పుడు, అనారోగ్యంగా వున్నప్పుడు మీ ఉద్యోగం అన్నివేళలా సహకరించదు - కావున కుటుంబ సభ్యులను, మిత్రులను దూరం చేసుకోవద్దు.
22. ఒకరిని చూసి కుళ్ళు కోవటం కేవలం మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవడమే. మీకు అవసరాన్ని బట్టి మీ వద్ద అన్నీ వున్నాయన్న విషయాన్ని మర వద్దు.
23. రాత్రి నిద్రపోయే ముందు ఈ రోజెలా గడిచింది, ఈ రోజూ సుఖంగా గడిచిపోయినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పటం అలవరుచుకోండి. ఇది మీ మనసుకు శాంతిని, కొంత ప్రశాంతతను చేకూరుస్తుంది.
24. మీ దగ్గర అన్నీ వున్నాయి, అందరి ఆశీస్సులూ వున్నాయి అని గ్రహించండి, ఆనందంగా జీవించండి. అనవసరంగా ఆందోళనకు లోనుకావద్దు.
25. అందరితో కలిసిమెలిసి, బేధాలు, విబేధాలు లేకుండా స్నేహంగా వుండటం నేర్చుకోండి. ఇవన్నీ పాటిస్తే మీరు సుఖసంతోషాలతో వర్థిల్లుతారన్నదే ఆశ.