సేమ్యా బఠానీ వడలు
కావలసిన పదార్థాలు
సేమ్యా - 100 గ్రాములు, బఠాణీలు - పావుకిలో, అల్లం ముక్కలు - 2 స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - 1 స్పూన్, వంట సోడా - చిటికెడు, పచ్చిమిర్చి - 12, కరివేపాకు - 4 రెమ్మలు, కొత్తిమీర తరుగు - కొద్దిగా, పసుపు - చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు - 2 కప్పులు, పుదీనా - కొద్దిగా, నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
సేమ్యా, బఠాణీలు విడివిడిగా ఉడికించాలి. చల్లారాక నీళ్లు వొంపేయాలి. బఠాణీలను చేత్తో మెత్తగా మెదిపి ఉడికించిన సేమ్యా, నూనె తప్ప మిగిలిన అన్ని పదార్థాలు అందులో కలపాలి. పిండి గట్టిగా ఉంటే సేమ్యా ఉడికించిన నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అరగంట నానబెట్టి సేమ్యా కలపాలి. దీన్ని వడల్లా చేసుకుని నూనెలో వేయించుకోవాలి. వీటిని పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.