సేమ్యా ఇడ్లీ
కావలసిన పదార్థాలు.
సేమ్యా - 2 కప్పులు, పెరుగు - 2 కప్పులు, నూనె - 3 స్పూన్లు
ఇంగువ - చిటికెడు, అల్లం - కొద్దిగా, పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
క్యారెట్ ముక్కలు - అరకప్పు, బఠాణీలు - అరకప్పు
ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
అర స్పూన్ నూనెలో సేమ్యా దోరగా వేయించాలి. అందులో పెరుగు కలిపి నాననివ్వాలి. బాండీలో రెండు స్పూన్ల నూనె వేసి ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి వేయించాలి. అందులోనే కరివేపాకు, అల్లం ముద్ద, ఉల్లిపాయ ముక్కలు కలిపి మగ్గబెట్టాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో నానబెట్టిన సేమ్యాలో కలిపి నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లలో వేయాలి. వీటిని ఆవిరి మీద ఉడికిస్తే వేడి వేడి సేమ్యా ఇడ్లీ రెడీ.