చిట్కా లిస్టు 1
నాకు తెలిసిన వంటయింటి చిట్కాలు ఒక చోట సమకూర్చి అందరికి అందుబాటులో ఉంచటమే నా ఉద్దేశం. వీటిలో కొన్ని నాకు తెలిసినవి, కొన్ని సైటులలో చూసి సేకరించినవి. వంట ఇంటి చిట్కాలు అని ఎక్కడ చూసిన వాటిని రాసి పెట్టుకునేదాన్ని. అలా కొన్ని టీవీ లో చూసినవి కూడా వున్నాయి. యీ చిట్కాలకి అంతు అంటూ వుండదు కాబట్టి అన్నిటిని ఒకే చోట పొందుపరిస్తే వీలుగా వుండదు కనుక ఒక్కో పోస్టులో 50 చొప్పున పెడుతున్నాను. తప్పకుండా వీటిని చదివి, మీ రోజు వారి జీవితం లో వుపయోగిన్చుకోటానికి ప్రయత్నించండి.
1. పచ్చి మిర్చి నమిలినప్పుడు, రెండు చుక్కల మజ్జిగ లేదా చెంచా పెరుగు, పిల్లలు అయితే అర గ్లాసు పాలు లేదా ఒక బ్రెడ్డు ముక్క తింటే ఆ మంట తగ్గుతుంది.
2. పిల్లల దుస్తుల మీద సాస్ పడితే ఆ ప్రాంతం లో గ్లిసరిన్ రాసి, సబ్బుతో రుద్దాలి.
3. బెండ కాయ కూర చేయటానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు వుండదు.
4. ప్లాస్టిక్కు వాటర్ బాటిల్స్ కడిగే ముందు చిటికెడు తినే సోడా అంతే సిట్రిక్ ఆసిడ్ వేసి కాస్త నీళ్ళు పోసి రెండు నిముషాలు వుంచి కడగండి. అడుగున ఉన్నమురికి పోతుంది.
5. సాంబారు లో ఉప్పు ఎక్కువ అయితే ఉడికించిన బంగాళ దుంపలు వేయండి.
6. కొబ్బరి ముక్కను పెరుగు లో వేస్తే పెరుగు తొందరగా పాడు అవదు.
7. పప్పు తొందరగా వుడకాలి అంటే ఉడికేటప్పుడు కొంచం డాల్డా కాని నూనె కాని వెయ్యాలి.
8. నిమ్మ కాయ తొక్కలు పిండాక కుక్కరులో వేస్తే వాసన రాదు.
9. పాలు కాచేటప్పుడు పొంగ కుండా వుండాలి అంటే అంచుకు నూనె రాయాలి.
10. పట్టు చీరలు ఉతికేటప్పుడు బకెట్టు లో నిమ్మ రసం వేస్తే రంగు పోదు.
11. పచ్చి మిరప కాయలు ముచ్చికలు తీసి ఫ్రిజ్జి లో పెడితే తొందరగా పాడు కావు.
12. పసుపు నీటితో వంటిల్లు శుబ్రం చేస్తే యీగలు రావు.
13. బిస్కట్టు పాకెట్టు బియ్యం డబ్బాలో ఉంచితే త్వరగా మెత్త పడవు.
14. గుడ్లు ఉడికించేటప్పుడు కొంచం ఉప్పు వేస్తే పెంకులు తొందరగా వెచ్చేస్తాయి.
15. యింగువ నిల్వ చేసే డబ్బాలో పచ్చి మిరపకాయ వేస్తే తాజాగా వుంటుంది.
16. కాబెజీ ఉడికించేటప్పుడు అల్లం ముక్క వేస్తే వాసన రాకుండా ఉంటుంది.
17. కత్తి పిటకి ఉప్పు రాస్తే పదును పెరుగుతుంది.
18. బట్టల మీద ఇంకు మరకలు పడితే నిమ్మ రసం కాని, టూత్ పేస్టూ తో కాని రుద్దాలి.
19. ఎండు కొబ్బరి చిప్ప కంది పప్పు డబ్బాలో వేసి ఉంచితే పప్పు పాడు అవదు.
20. వెల్లుల్లి పాయను మెత్తగా దంచి నీళ్ళలో కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచితే బొద్దింకలు రావు.
21. మినప పప్పు త్వరగా నానాలి అంటే ఆ నీటిలో యినప వస్తువు ఏది అయినా వేయాలి.
22. వడియాల పిండి లో నిమ్మ రసం వేస్తే వడియాలు తెల్లగా వస్తాయి.
23. బ్రెడ్ పాకెట్టు లో బంగాళ దుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడు కావు.
24. నూనె పొంగకుండా వుడాలి అంటే చింత పండు వెయ్యాలి.
25. చేతులకి నూనె రాసి పనస కాయ తరిగితే జిగురు వుండదు.
26. క్యారెట్టు తొడిమను తీసి air tight బాగు లో బద్ర పరుస్తే ఎక్కువ కాలం తాజా గా వుంటాయి.
27. అరటి పళ్ళను నలుపు ప్లాస్టిక్కు బాగు లో పెట్టి ఫ్రిజ్జి లో పెట్టినట్లు అయితే వారం తరవాత అయినా అవి నల్ల పడకుండా పసుపు రంగులోనే వుంటాయి.
28. క్యారెట్టు వండేటప్పుడు ఆ నీళ్ళల్లో నిమ్మ రసం చేరిస్తే రంగు మారకుండా వుంటుంది.
29. పచ్చి మిర్చి ముక్కలు కోసిన తరవాత ఆ చేతి మంటలు తగ్గాలి అంటే మీ చేతి వేళ్ళని చల్లని పాలలో పంచదార వేసిన పాత్రలో ముంచండి.
30. మెత్తని ఇడ్లీలు కావాలి అంటే ఇడ్లీ పిండి ని పులిసినాక కలపకూడదు. అలాగే పిండిని ఇడ్లీ ప్లేటు లో వెయ్యాలి.
31. పనీరును డీపు fry చేసేకంటే మరిగే నీళ్ళలో ముంచితే మెత్తగా వుంటాయి.
32. కూరల్లో, పులుసు లో ఉప్పు, కారం ఎక్కువ అయితే 2 చెంచాల సెనగపిండిని వేయించి కలిపితే సరి.
33. బకెట్టు గోరు వెచ్చని నీటిలో 2 కప్పుల పాలు చేర్చి, ఆ నీటిలో స్నానం చేయటం వల్ల పొడి బారిన చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.
34. అర కప్పు ఓట్సు లో కొద్దిగా పుల్ల పెరుగు చేర్చి స్నానం చేయటానికి ముందు నలుగు పెట్టుకుంటే చర్మం లో పేరుకున్న మృత కణాలు తొలగిపోతాయి.
35. 4 బర్నరు గాసు స్టవ్వు ఉపయోగించేటప్పుడు, వెనక దాని మీద కుక్కరు, పాలు కాయటం, డీప్ ఫ్ర్యెస్ వంటివి ముందు బర్నర్ మీద మాములు వంటలు చేస్తే వీలుగా వుంటుంది.
36. కప్పు నీళ్ళల్లో వాడేసిన నిమ్మ చక్కలు, లవంగాలు వేసి మరిగించి దాన్ని ఓవెన్ లో ఉంచితే పదార్దాల తాలుకు వాసనలు రావు.
37. యింట్లో ఏవయిన గాజు వస్తువులు పగిలి నప్పుడు మెత్తని బ్రెడ్డు ముక్కతో నేలని తుడిస్తే గాజు ముక్కలు బ్రెడ్డు ముక్కకి అత్తుక్కు పోతాయి.
38. ఉప్పు లో అర చెంచా బియ్యం వేస్తే మెత్త పడకుండా పొడిగా, తాజాగా వుంటుంది.
39. దోసెల పిండి రుబ్బేటప్పుడు, కాస్త అన్నం వేసి రుబ్బితే, దోసెలు మృదువుగా వస్తాయి.
40. సూపులు కాని, గ్రేవీ కూరలు కాని వండేటప్పుడు క్రీము లేకపోతే పాలు, వెన్న కలిపిన మిశ్రమం కలిపితే సరి.
41. ఉడికించిన కోడి గుడ్లు చల్లని నీటిలో 5 నిమిషాలు ఉంచితే, దానిపైన పెంకు తేలికగా వస్తుంది.
42. సాంబారు పొడి, రసం పొడులు deep ఫ్రీజేర్ లో ఉంచితే ఎక్కువ కాలం దాని సువాసన పోకుండా వుంటుంది.
43. spongy egg scramble కావాలి అంటే గుడ్డు beat చేసేటప్పుడు 3 చెంచాల పాలు పోయాలి.
44. వాసన వచ్చే వంటలు చేసేటప్పుడు, ఒక గుడ్డను తడిపి, వంట గదిలో కనుక ఆరపెడితే, ఆ వాసన అంతా ఆ గుడ్డకి పట్టి, గదిని తాజాగా ఉంచుతుంది.
45. ఉల్లి పేస్టు చేసేటప్పుడు, ఉల్లిపాయల్ని కొంచం నూనెలో వేయించి చెయ్యాలి. పచ్చి ఉల్లి పేస్టు త్వరగా చేదు అవుతుంది.
46. కారెట్లు, పచ్చి బటానీలు, బీటు రూటు, కార్న్ వండేటప్పుడు కొంచం చక్కర కనుక వేసి వండితే ఆ flavour పోకుండా వుంటుంది.
47. పూరీలు లేదా పకోడీలు fry చేసేటప్పుడు ఆ నూనె లో చిటికెడు ఉప్పు చేరిస్తే నూనె ఎక్కువ పిల్చవు.
48. కాకరకాయలను ఉప్పు వేసిన నీటిలో అరగంట ఉంచితే చేదు పోతుంది.
49. cheese గ్రేట్ చేసాక పచ్చి బంగాళా దుంపను గ్రేట్ చేసినట్లు అయితే ఆ గ్రేటర్ తేలికగా శుభ్రం అవుతుంది.
50. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిలవ వుండాలి అంటే, వాటి ముచ్చికలు తీసి భద్రపరిస్తే సరి.