ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

KITCHEN TIPS FOR WOMEN -2


చిట్కా లిస్టు 2

రెండో లిస్టు ని తిలకించండి....

1. Noodles ఉడికాక ఉడికించిన నీరు పారపోసి, చల్లని నీరు పోస్తే, విడివిడిగా వస్తాయి.

2. పాలకూర, యితర ఆకుకూరలు వుడుకుతున్నప్పుడు కాస్త చక్కర వేసి ఉడికిస్తే రంగు మారకుండా వుంటుంది.

3. Bay Leaf ను పిండి వున్న డబ్బాలో వేస్తే, పిండిలో తేమ చేరకుండా వుంటుంది.

4. అల్యూమినియం పాత్రలలో పుట్ట గొడుగులు వండితే, పుట్ట గొడుగులు డార్కు గా అవుతాయి. అందుకు అవి వేరే ఏది అయిన పాత్రలో వండాలి.

5. అరటి పండు త్వరగా పండాలి అంటేనే ఆపిలు పండు దగ్గర పెట్టాలి.


6. అరటి పండు త్వరగా పాడుకాకుండా వుండాలి అంటే ఆపిలు దగ్గర అస్సలు పెట్టకూడదు.

7. ఉల్లి పాయలు వేపేటప్పుడు కొంచం పాలు పోస్తే రంగు మారకుండా, మాడ కుండా వుంటాయి.

8. Lettuce ఆకును వేడి soopu పైన తేలే లాగ వేస్తే దానిలో వున్న కొవ్వును తీసేస్తుంది.

9. అల్యూమినియం పాత్రలు ఆ రంగు, మెరుపును పోగొట్టుకోకుండా వుండాలి అంటే కొన్ని ఆపిలు తొక్కలు ఆ గిన్నెలో వేసి కొన్ని నిమిషాలు మరగనిచ్చి, కడిగి ఎండనివ్వాలి.

10. గుడ్లు వుడికిన్చేటప్పుడు ఒక స్పూన్ వెనిగర్ వేసి ఉడికిస్తే, గుడ్డు పగిలినా కూడా లోపల వున్నది బయటకు రాదు.

11. గోబీ వండేటప్పుడు ఆ తెలుపుదనం పోకుండా వుండాలి అంటే, వుడికించే నీళ్ళల్లో కాస్త పాలు కలపాలి.

12. వంకాయ ముక్కలు తరిగే నీటిలో ఒక చెంచా పాలు చేరిస్తే ముక్కలు నల్ల పడకుండా వుంటాయి.

13. బంగాళ దుంపల్ కి మొలకలు రాకుండా వుండాలి అంటే, బంగాళాదుంపల కవరు లో ఒక ఆపిలు వేస్తే సరి.

14. బెండ కాయ వండేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మ రసం కాని, ఒక చెంచాడు పెరుగు కాని వేస్తే జిగురు పోతుంది.

15. కప్పు కి పట్టిన కాఫీ మరకలు పోవాలి అంటే, ఆ కప్పుని ఏది అయిన ఒక సోడా తో నింపి మూడు గంటలు వుంచేతే మరకలు పోతాయి.

16. గుడ్డు నేల మీద పడి పగిలినప్పుడు, దాని మిద ఉప్పు చల్లి అయిదు నిమిషాలు వుంచి తరువాత పేపరు కాని, టవలు తో కాని తుడిస్తే తేలిక అవుతుంది.

17. పచ్చిమిర్చి నమిలినప్పుడు, ఒక సిప్పు చల్ల పాలు తాగితే మంట తగ్గుతుంది.

18. ఆకు పచ్చ కూరలు, ప్లాస్టిక్కు కవరులలో భద్ర పరిస్తే త్వరగా పాడు అవుతాయి.

19. ఫ్రిజ్జి లో నిమ్మ చెక్క పెడితే ఫ్రిజ్జి వాసన రాకుండా వుంటుంది.

20. కూరలు వుడికిన్చేటప్పుడు వాటిని ముక్కలుగా కాకుండా అలాగే వుడికిన్చినట్లయితే వాటిలో వున్న పోషక విలువలు కోల్పోకుండా వుంటాయి.

21. నిమ్మ కాయని నీళ్ళలో పెట్టి, ఫ్రిజ్జి లో పెడితే తాజాగా వుంటుంది.

22. ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే, వేయిన్చేటప్పుడు కాస్త ఉప్పు చేరిస్తే సరి.

23. వెల్లుల్లి వలిచేముందు కాసేపు వేడి పెనం మీద వేయిస్తే, తొక్క తీయటం తేలిక అవుతుంది.

24. గుడ్డును కొట్టేముందు, ఆ గిన్నెను ఒకసారి నీళ్ళతో కడిగినట్లయితే, సొన గిన్నెకి అత్తుక్కోకుండా వుంటుంది.

25. బాదం తొక్క సులువుగా తీయాలి అంటే, వాటిని మరిగే నీటిలో అయిదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.

26. అన్నం వండేటప్పుడు ఒక స్పూను నూనె కాని ఒక స్పూను నిమ్మ రసం కాని చేరిస్తే అతుక్కోకుండా వస్తుంది.

27. బంగాళా దుంపలు, ఉల్లి పాయలు పక్క పక్కన పెడితే, బంగాళా దుంపలు త్వరగా పాడు అవుతాయి.

28. ఏదయినా వంట లో ఉప్పు ఎక్కువ పడితే, పచ్చి బంగాళా దుంప ముక్కలని వేస్తే ఉప్పు తగ్గుతుంది.

29. పాలు అడుగంటకుండా వుండాలి అంటే, మరిగించేటప్పుడు కాస్త చక్కర వేస్తే సరి.

30. కారం నిలవ చేసుకున్న డబ్బాలో కొంచం యింగువ వేసినట్లు అయితే ఎక్కువ కాలం నిలవ వుంటుంది.

31. కేకులు వండేటప్పుడు, గుడ్డు నీచు వాసన రాకుండా వుండాలి అంటే, గుడ్డు కొట్టేటప్పుడు ఒక స్పూను తేనె వేస్తే సరి.

32. ఇడ్లీలకి , దోశలకి పప్పు నానపోసేముందు బాగా కడిగి తరువాత నాన పోసి, రుబ్బేముందు ఆ నాన పోసిన నీళ్ళతో రుబ్బితే పోషక విలువలు పోకుండా వుంటాయి. అలా కాకుండా నానపెట్టే ముందే మొత్తం కడిగేసి నాన పెడితే అందులో విలువలు పోతాయి.

33. గ్రేవి కాని, సూపు కాని చిక్కగా ఉండటానికి, కార్న్ ఫ్లోర్ ని నీళ్ళలో ఉండలు లేకుండా కలిపి అందులో పోస్తే సరి.

34. డీపు fries చేసేటప్పుడు ఒక్కోసారి నూనె బాగా వేడి ఎక్కి నురగలు వచ్చేస్తుంది. అప్పుడు దానిలో చిన్న చింత పండు ముక్క వేసినట్లు అయితే ఆ నురగ తగ్గటమే కాక మీదకు చిందకుండా వుంటుంది.

35. ఉల్లి పాయను కోసే ముందు ఫ్రిజ్జి లో పెట్టినా లేక కోసేముందు ముక్కలు గా కోసి నీళ్ళలో వేసినా, కళ్ళలో నుండి వచ్చే నీళ్ళను అరికట్టవచ్చు.

36. దోశల పిండి నానపోసేటప్పుడు ఒక స్పూను మెంతులు వేసి నానపోస్తే దోశలు కరకరలాడుతూ వుంటాయి.

37. మైక్రోవేవు వోవేను లో వేడి చేసేటప్పుడు గుండ్రటి గిన్నెలలో ఆహారం వేడి చేస్తే వేడి మొత్తం సమానంగా వ్యాపించి త్వరగా వేడి అవుతుంది.

38. పప్పు వండేటప్పుడు కొంచం నూనె వేసి వండితే త్వరగా ఉడుకుతుంది.

39. ఫుడ్ కలర్లు వాడటం అంత మంచిది కాదు కాబట్టి యిలా చేసి చూడండి. ఒక బీట్రూట్ ను బాగా తురిమి ఎండలో తడి లేకుండా ఎండపెట్టి, పొడి చేసి నిల్వ చేసుకోండి. కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు.

40. ముదిరిపోయిన సొరకాయ గింజలని బియ్యం తో నానపోసి రుబ్బి దోశలు పోస్తే, దోశలు చాలా రుచిగా వుంటాయి.

41. మిగిలిన అన్నం లో కాస్త ఉప్పు, కారం, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బి, వడియాలు పెట్టుకుని, నూనె లో వేయించి తింటే చాలా బాగుంటాయి.

42. పూరీల పిండి కలిపేటప్పుడు అందులో కాస్త చక్కర వేసి కలిపితే పూరీలు చాలా సేపటివరకు తాజాగా వుంటాయి.

43. పప్పులు, బియ్యం త్వరగా నానాలి అంటే వేడి నీళ్ళతో నానేస్తే సరి.

44. బియ్యం లో ఎక్కువ మట్టి గడ్డలు వుంటే చారెడు ఉప్పు వేసి పది నిమిషాలు నాననిస్తే మట్టి గడ్డలు అందులో కరిగిపోతాయి.

45. కూరగాయ ముక్కలను పసుపు కలిపిన నీళ్ళలో ఉంచితే ఏమయినా క్రిములు వుంటే అవి పైకి తేలుతాయి.

46. ఫ్రిజ్జి లో నుండి తీసిన నిమ్మకాయను room temperature కు వచ్చాక మాత్రమే రసం తీయాలి. లేకపోతే రసం తక్కువ వస్తుంది.

47. ఆకుకూరలు ఇనప బాండిలో వండకూడదు. నల్లపడతాయి.

48. పాలు కాచేటప్పుడు అందులో కొంచం వంట సోడా వేస్తే, పాలు విరగవు.

49. ఎండాకాలంలో పాలు విరగకుండా వుండాలంటే ఒక పళ్ళెం లో నీళ్లు పోసి పాల గిన్నెను అందులో ఉంచాలి.

50. నెయ్యి కాచి దించేముందు చిటికెడు మెంతులు వేస్తే సువాసనగా వుంటుంది.