ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Thai Vegetable Basil Fried Rice


Thai Vegetable Basil Fried Rice

Authentic food లో ఇండియన్, mexican తరువాత నేను వేసే ఓటు Thai ఫుడ్ కేతరువాతేchineese అయినాఅమెరికన్ అయినా లేక ఇటాలియన్అయినా. Vegetarians కి అక్కడ పెద్ద choice  అంటూ ఏమి వుండదునా మటుకు నాకు ఉన్న ఒకే ఛాయస్.... Thai Vegetable Basil Fried Rice . సాధారణం గా  
chineese , Thai Vegetable Fried Rice లలో ఎగ్ఫిష్ సాస్ , Oyester సాస్ తప్పకుండావేస్తారు మనం వద్దు అని చెప్పకపోతే తప్ప నా మటుకు నేను మాత్రం వెళ్ళగానే 'విత్ నో ఎగ్నో ఫిష్సాస్ నో Oyester సాస్ అని తప్పకుండా చెప్తానుసరే యిక నాకు నచ్చిన ingrediants తో నేను ట్రైచేసిన Thai Vegetable Basil Fried Rice కి సంబందించిన విషయానికి వస్తే.... ( కావలసి వస్తేపైన నేను 'నోఅని చెప్పబడిన వాటితో కూడా మీరు మీ వెర్షన్ రెసిపి ట్రై చేసుకోవచ్చు. )
కావాల్సిన పదార్దాలు:
సోనమసూరి బియ్యం రెండు కప్పులుబెల్ పెప్పర్ (గ్రీన్రెడ్ఎల్లోమూడు రంగులలో తీసుకుంటే చూడటానికి అందం గా కనపడుతుంది, Thai Basil leaves (యిది ఒక bunch పడుతుందిమామూలు అమెరికన్ గ్రోసెరీ లో కంటే కొరియన్ లేదా chineese గ్రోసెరీ లో బాగా దొరుకుతుంది.)
నువ్వుల నూనె ( రెసిపి కి తప్పకుండా నువ్వల నూనె వాడి తీరాలి), రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ (ఎండుమిర్చిఒకసారి వేయించి మిక్సీ కొడితే సరిపోతుందిలేదా ఎప్పుడయినా పిజ్జా హట్ కి వెళ్ళినప్పుడు ఒకనాలుగు రెడ్ పెప్పర్ పాకెట్స్ తీసుకొచ్చి స్టోరు చేసుకున్నట్లు అయితే యింట్లో కోరు పెట్టె బాధతప్పుతుందినేను అయితే అదే చేస్తానుమీకు అదే చేయమని చెప్తాను), పచ్చి మిర్చి మూడువెల్లుల్లిరెబ్బలు నాలుగుఉప్పు తగినంతఅజినమోతో చిటికెడుసోయా సాస్ తగినంత.
తయారు చేసే విధానం:
1 . ముందుగా ఒకటికి రెండు చొప్పున నీరు పోసి అన్నం ఉడికించి పెట్టుకోవాలి.
2 . ఒక చిన్నపాటి రోకలి తీసుకుని వెల్లుల్లిపచ్చి మిర్చి ముక్కలను బాగా దంచి పెట్టుకోవాలి.
3.  వెడల్పాటి పాన్ తీసుకునిఅందులో మూడు చెంచాల నువ్వుల నూనె వేసిఅది కాగాక,పచ్చిమిర్చివెల్లుల్లి దంచిన మిశ్రమం వేసిఅది వేగాక రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ వేసి కాసేపు వేగనివ్వాలిపాటికే మీకు Thai వాసనలు వచ్చేస్తుంటాయి
4 . ఇప్పుడు సన్నగాపొడుగ్గా తరిగిన బెల్పెప్పర్ ముక్కలు వేసి ఫ్ర్య్ చేయాలియిక్కడ గుర్తు పెట్టుకోదగిన విషయం ఏమిటి అంటే.... ముక్కలుపచ్చి వాసన పోయి క్రిస్పి గా తయారు అవుతే చాలుబాగా వేగనక్కరలేదు.
5 . ఇందులో కాస్త ఉప్పుఅజినమోతో వేసి బాగా కలిపితరువాత మూడు చెంచాల సోయా సాస్ వేసికలపాలి
6 . దీనిలో తరిగిన basil ఆకులను వేసి బాగా కలిపిఉడికించిన అన్నం కూడా వేసి బాగా కలపాలి.
7 . చివరగా ఒక సారి ఉప్పుసోయా సాస్నూనె చూసుకుని తక్కువ అయితే మరల కొంచం వేసికలుపుకోవాలి.  కారం తక్కువ అయింది అనిపిస్తే రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ దానిపై చల్లుకోవచ్చు.
                ఇది మీరు వేడి వేడి గా తింటేనే  రుచి ఎంజాయ్ చేయగలరుచాలా తేలికగాచేసుకోవచ్చుఅన్నం వండి పెట్టుకుంటేప్రాసెస్ చాలా సులభంవీటికి కావాల్సిన వస్తువులు కూడాతక్కువేయిందులో ప్రత్యేకం గా గుడ్డుఉల్లిపాయ కావాలి అనుకునేవారు విడిగా పాన్ తీసుకునిఅందులో ఒక రెండు చెంచాల నూనె పోసికాగాకసన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లి పాయ ముక్కలు వేసిఫ్ర్య్ చేసిఒక గుడ్డు దానిలో కొట్టికాస్త ఉప్పు చల్లిఫ్రైడ్ రైస్ లో కలిపితే  flavour డిఫరెంట్ గావుంటుందిఅలాగే మన ఇష్టాన్నిబట్టి brocali కూడా వాడుకోవచ్చు. brocali ముక్కలను ఒకసారికడిగి మైక్రో వేవ్ ఓవెన్ లో ఒక అయిదు నిమిషాలు వుంచి అప్పుడు కూర ముక్కలతో సహా వేయిస్తేసరిపోతుందిఉల్లిపాయ యింక గుడ్డు మాత్రం కూర ముక్కలతో పాటు కాకుండా విడిగా చేస్తేనేబాగుంటుంది.
                 తప్పకుండా  రెసిపి మీరు మీ ఇంట్లో నే ట్రై చేసి ఎంజాయ్ చేయండి


THE ABOVE RECIPE COLLECTED FROM: