భారతీయుల ఇళ్లలో పూజకి పత్య్రేక స్థానం ఉంది. ప్రతి భారతీయుడు తమ ఇంట్లో ప్రత్యేకంగా పూజ కోసం ఒక ప్రత్యేక గదిని కేటాయిస్తారు. చిన్న చిన్న ఐడియాలు ఉపయోగిస్తే పూజ గదిని మరింత అందంగా సృష్టించవచ్చు. ఇళ్లలో పూజ గది ఉంటే శుభాలు జరుగుతాయని భారతీయుల అభిప్రాయం. పొద్దున్న లేవగానే స్నానపానాదుల ఆచరించిన తర్వాత చాలా మంది ఇళ్లలోనే పూజ గదిలో కొద్ది నిమిషాలు గడపడడం చాలా ఇళ్లలో ఆనవాయితీ. దీని వల్ల మనశ్శాంతి లభిస్తుందని చాలా మంది భావిస్తుంటారు.
కొత్త శక్తి వస్తుందని చాలా మంది అభిప్రాయడుతుంటారు.
పూజ గదిని శుభ్రంగా కొద్దిగా శ్రద్ధ పెడితే మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు. ఇళ్లలో పూజ గదికి అనుకూలమైన స్థలం ఈశాన్య దిక్కున కార్నర్‌లో ఉండే విధంగా ఎంచుకోవడం ఉత్తమమైనది. ఈ దిక్కును పూజ గది ఉంటే చక్కటి ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి లభిస్తుందని చాలా మంది నమ్మకం. పూజ గదిలో మనం ప్రతిష్ఠించే విగ్రహాలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉండాలి, తూర్పు, కాని పడమర కానీ ఫర్వాలేదు.
కానీ, ఎట్టి పరిస్థితుల్లో దక్షిణవైపు మాత్రం చూడకుండా ఉండే విధంగా జాగ్రత్త వహించాలి. మరో ముఖ్య మైన అంశం దృష్టిలో ఉంచు కోవాల్సింది మెట్ల కింద మాత్రం ఎట్టి పరిస్థితిలో పూజ గదిని ఏర్పాటు చేయ రాదు. అలాగే స్నానాల గది వద్ద కా నీ, వంట గది పక్కన లేకుండా జాగ్రత్త పడటం మంచిది.
పూజగదిని చక్కగా అందంగా తీర్చిదిద్దేందుకు పలు సూచనలు సలహాలు ఇవి:
- పూజ గది గోడలకు మీ ఎంపిక చేసుకునే రంగలు మాత్రం లైట్ కలర్ షెడ్‌లు ఉండే విధంగా ఎంచుకోండి. గోడలకు వేసిన రంగుల వల్ల మనస్సు ప్రశాంతత చేకూర్చే విధంగా ఉండాలి. పూగ గదికి వేసే రంగులు ముఖ్యంగా తెలుపు రంగుతో పాటు టైలు ఎల్లో (పసుపు) పింక్ (లేత గులాబి) లైట్ బ్లూ కలర్స్‌గా బాగా ఉంటాయి.
- పూజ గదికి ఏర్పాటు చేసే మండపాన్ని చక్కగా అలంకరించాలి. ఈమండపాన్ని సంప్రదాయబద్ధంగా ఉండే విధంగా చక్కటి కలపను వాడాలి. ప్రస్తుతం మార్కెట్‌లో మార్బల్, ఇత్తడితో పాటు గ్రైనేట్ మండపాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ మండపాలకు పూలతో చక్కగా అలంక రించాలి.
- మండాపాల ఎంపిక తర్వాత తర్వాత చేయాల్సిన పని దానికి తగ్గ విగ్రహాల ఎంపిక. విగ్రహాల ఎంపికకు తేలికపాటి విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి.
- చక్కతో చేసిన విగ్రహాలైతే నయం. లేదా లోహంతో తయారు చేసినవ కూడా ఫర్వాలేదు. బంకమట్టితో చేసిన విగ్రహాలు కూడా వాడవచ్చు. పూజ గదిలో వెండి, రాగి లేదా ఫ్రేమ్‌తో తయారు చేసిన ఫోటోలను పూజ గది గోడలకు అందంగా అలంకరించవ్చు.
- గోడలకు స్టయిల్‌గా ఉండే గాజుతో తయారు చేసిన షెల్ఫ్‌ను ఏర్పాటు చేసుకుని దానిపై కూడా దేవుని విగ్రహాలతో పాటు, దేవుని ఫోటోలు ఉంచుకోవచ్చు.
- పూజ గదిలో వెండి, లేదా ఇత్తడి దీపస్తంభాలు మార్కెట్లో వివిధ షేప్‌లలో లభిస్తాయి. వాటిని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే పూజ గదికి మరింత అందం చేకూరుతుంది.
- మార్కెట్‌లో వివిధ రకాల షేప్‌లలో, సైజ్‌లలో అగవబత్తిల స్టాండ్‌లు లభిస్తాయి. వీటిని కినుగోలు చేసి పూజగదిలో ఉంచుకోవాలి. వివిధ రకాల పండుగలకు దాని ప్రకారం పూజ గదిని అకర్షణీయంగా అందంగా తీర్చిదిద్దుకోవాలి
- పూజ గదిలో గంటలు ఏర్పాటు చేసే బదులు గదికి ఏర్పాటు చేసే తలుపులకు గంటలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తలుపులు ఏర్పాటు చేసేటప్పుడు సీత్రూ (తలుపులకు కంతలు) ఏర్పాటు చేసుకుని వాటికి గంటలు ఏర్పాటు చేసుకోవాలి. తలుపు కంతలకు ఇత్తడి లేదా వెండి గంటలు ఏర్పాటు చేసుకోవాలి. మీరు తలుపులు తీసేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు గంటలు ఆటోమెటిక్‌గా మోగుతాయి.
- వెండితో తయారు చేసిన పళ్లాలు వాడవచ్చు. వాటిలో కర్పూరం, చందనం, పూలు తదితర పూజసా మగ్రిని ఉంచుకోవచ్చు.
- పూజ గదిలో హేగింగ్ లైట్‌లు లేదా రోప్ లైట్లు.... మార్కెట్లో వివిధ రంగుల్లో లభిస్తాయి. వీటని పూజగదిలో వాడుకుంటే వివిధ రంగుల్లో వివిధ రకాల్లో లైట్లు కాంతివేదజల్లుతూ బాగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
- చివరగా... పూజ గదిలో పూలు లేవంటే చాలా కొరతగా కనిపిస్తుంది... పూలు లేవంటే పూర్తిస్థాయిలో పూజలేనట్లే... కాబట్టి కాలాన్ని బట్టి రుతువులను బట్టి మార్కెట్లో వివిధ రకాల పూలు లభిస్తుంటాయి. రోజుకో రకం పూలను వాడుకోవచ్చు.
పూజ చేసేటప్పుడు మనస్సును పూర్తిస్థాయిలో లగ్నం చేయాలి. దీంతో ఆ రోజంతా మనశ్శాంతి కలుగుతుంది.