ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHAT IS REFRIGERATOR - HOW TO STORE PROVISIONS ON A REFRIGERATOR - TIPS FOR EASY CLEANING OF A REFRIGERATO ETC


రుచికరంగా ఉన్న కూర ఏదైనా మిగిలితే వెంటనే వచ్చే ఆలోచన దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి రేపు వేడి చేసుకు తిందామని. అలాగే పాలు, పెరుగు ఒకటేమిటి రకరకాల పదార్ధాలను నిల్వ ఉంచడానికి ఫ్రిజ్‌ను ఉపయోగించడం సర్వసాధరణంగా మారిపోయింది. అయితే దానిని ఎప్పటికప్పుడు శుభ్ర పరుస్తూ ఉండకపోతే మాత్రం పురుగులు చేరి మొదటికే మోసం వచ్చే అవకాశముంది. కనుక ఫ్రిజ్‌లో చెత్తచేరిపోయిందనిపించిన వెంటనే శుభ్రం చేయడం మంచిది.


ఫ్రిజ్‌ను శుభ్రం చేయడం కాస్త ఓపికతో కూడుకున్న పనే. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే అది అవసరం. ఫ్రిజ్‌ను శుభ్రం చేయాలనుకున్నప్పుడు ముందుగా అందులో ఉన్న పదార్ధాలన్నీ తీసి బయటపెట్టండి. చద్దివాసన కొట్టేవి, కుళ్ళిపోయినవి ఉంటే తీసి విసిరేయాలి. తర్వాత అందులో ఏమేం పెట్టాలో నిర్ణయించుకోవాలి.
  • ఫ్రిజ్‌లో తొలగించేందుకు అనువుగా ఉన్న భాగాలన్నీ తీసి పక్కన పెట్టాలి. కింద ఉండే డ్రిప్‌ ట్రేతో సహా. నాన్‌ టాక్సిక్‌ సోప్‌ తీసుకుని గోరు వెచ్చటి నీళ్ళలో కలిపి ఒక స్పాంజ్‌తో వాటిని శుభ్రం చేయాలి. అయితే అమోనీయా, బ్లీచ్‌ కలిగిన క్లీనింగ్‌ ప్రోడక్ట్‌లను ఫ్రిజ్‌కు ఉపయోగించకపోవడమే మంచిది. అంతా శుభ్రం చేసిన తర్వాత ఒక పొడి టవల్‌తో దానిని తుడవాలి. 
  • ఆ సబ్బు నీళ్ళతోనే ఫ్రిజ్‌ లోపల, డోర్‌ను కూడా కడగండి. తర్వాత శుభ్రంగా పొడిగా తుడవాలి. ఏదైనా ఆహార పదార్ధాలు ఫ్రిజ్‌లో పడి అదే వాసన వస్తుంటే కాస్త బేకింగ్‌ సోడాను వెచ్చటి నీటిలో కలిపి తుడవాలి. తర్వాత ఫ్రిజ్‌లో షెల్ఫ్‌లను అమర్చాలి. ఫ్రిజ్‌ల మోడళ్ళు మారినా కొన్ని ప్రాథమిక అంశాలు ఒకేరకంగా ఉంటాయి. 



  • కూరగాయలను క్రిస్పర్‌ డ్రాయర్‌లోనే పెట్టాలి. ఎందుకంటే ఆ అరలో టెంపరేచర్‌ కూరగాయలకు అనువుగా ఉండేలా అమరుస్తారు. వాటిని జిప్‌లాక్‌ బ్యాగులలో పెట్టడం మరీ ఉత్తమం.
  • మాంసం, పాల డబ్బాలు, గుడ్లు తలుపుకు ఉన్న అరలలో పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్‌లో టెంపరేచర్‌కన్నా తలుపు దగ్గర వెచ్చదనం ఎక్కువగా ఉంటుంది. కనుక అందులో జ్యూసులు, వైన్‌ వంటివి మాత్రమే పెట్టుకోవడం ఉత్తమం. 
  • మాంసం, చికెన్‌ వంటివాటిని దాచాలనుకున్నప్పుడు వాటిని ఒక ప్లాస్టిక్‌ బ్యాగులో పెట్టి పెట్టడం ఉత్తమం. తద్వారా అవి అవసరమైనంత చల్లదనంలో ఉండడమే కాకుండా కింద ఉన్న వాటిపై అందులోని సారం పడదు. 
  • పెరుగు, పాలు, చీజ్‌, వెన్న వంటివాటినన్నింటినీ ఒకే చోట కలిపి పెట్టడం మంచిది. అలాగే పళ్ళ విషయమైనా. ఇక బీర్‌, సోడాలు కలిగి ఉండేవారు వాటన్నింటినీ వరుసలలో పెట్టుకోవడం వల్ల లుక్‌ బాగుంటుంది. 
  • సామాన్లను తిరిగి ఫ్రిజ్‌లో పెడుతున్నప్పుడు ఒక్కొక్క దానినీ తడి బట్టతో తుడిచి లోపల పెట్టాలి. తద్వారా జిగట ఫ్రిజ్‌కు అంటకుండా పరిశుభ్రంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు బేకింగ్‌ సోడా డబ్బాను ఫ్రిజ్‌లో తప్పనిసరిగా ఉంచాలి. ఎందుకంటే ఏవైనా వాసనలు వస్తుంటే వాటిని అది పీల్చుకొని ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచుతుంది.
  • ఫ్రిజ్‌ను ఇదే విధంగా శుభ్రం చేయడం మరువరాదు. దానిని కూడా బేకింగ్‌ సోడాతో తుడవడం వల్ల ఎటువంటి దుర్వాసనా లేకుండా శుభ్రంగా ఉంటుంది. ఫ్రీజర్‌ను ఎప్పటికప్పుడు డీఫ్రాస్ట్‌ చేసుకుంటూ ఉండడం చాలా అవసరం.