ప్రేమలో ఉన్నప్పుడు నియంత్రించే ప్రయత్నం చేస్తే అది ఆగ్రహాలకు, చిరాకులకు దారి తీస్తుంది. ముఖ్యంగా మనసుకి సంబంధించిన విషయాలలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పించుకోవడం వ్యక్తులకు ఇష్టం ఉండదు. మీ భర్తకు మీకు నచ్చని అలవాట్లు ఉంటే, వాటిని విస్మరించి అతడిని అతడిగా స్వీకరించడం వల్ల ఆనందం లభిస్తుందే తప్ప మీరు అనుకున్నట్టుగా మలచుకొనే ప్రయత్నం చేస్తే సమస్యలు రావచ్చు. నిజంగా ప్రేమించిన వ్యక్తిని ఆమోదించినప్పుడు ఆ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు మనలో ఉన్న లోపాలను సరిచేసుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఎదుటి వారిలో లోపాలను సరి చేయడం కాదు.ఈ మూడింటిని పాటించడం మొదలు పెడితే ఎంతటి సుఖశాంతులు లభిస్తాయో గమనించండి. అనవసరమైన ఒత్తిడి ఉపశమించి సంతృప్తి కలుగుతుంది.
ఎప్పుడూ అంతా ప్రణాళికాబద్ధంగా, నియంత్రితంగా ఉండడం వల్ల లాభాలు ఉంటాయేమో కానీ దాని వల్ల ఎదురయ్యే ఒత్తిడిని భరించడం సామాన్యమైన విషయం కాదు. ఆ ఒత్తిడి కారణంగా ముఖ్యమైన అవకాశాలను మనం కోల్పోవచ్చు కూడా. మనకు మనం గీసుకున్న గీతను దాటితే ఏమౌతుందో అన్న భయం వల్ల మన చుట్టూ జరుగుతున్న అద్భుతాలను తెలుసుకునే అవకాశాన్ని కూడా కోల్పోతాం. వ్యక్తిగతంగా గీసుకున్న లక్ష్మణ రేఖను దాటేందుకు సహాయపడే కొన్ని టిప్స్ ఉన్నాయి. ప్రయత్నించి చూడండి.
మనం నియంత్రితంగా, పరిధిలో ఉండాలని కోరుకోవడానికి కారణం భయమే. కనుక దానిని వెంటనే ఎదుర్కోవడం ముఖ్యం. ఈ భయాలు పిల్లలకు సంబంధిచినవి కావచ్చు మరేవన్నా కావచ్చు. కానీ వాటిని మనం అనుకుంటున్న కోణానికి విరుద్ధమైన కోణంలోంచి చూసినప్పుడు మన భయాలు అనవసరమైనవని తేలుతుంది. మీరు భయపడుతున్న విషయాలను, వాస్తవాలను విడదీసి చూడడం ద్వారా భయాలను పోగొట్టుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు... చాలా వరకు మన భయాలకూ, వాస్తవాలకూ చాలా వైరుధ్యం ఉంటుందనే విషయాన్ని గమనించాలి.
ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించడం నిరాశకు దారి తీస్తుంది. దీనితో పరిధిలో ఉండాలనే భావన ఇంకా పెరిగిపోతుంది. ఉదాహరణకు మీ తోటి ఉద్యోగులను మీ ప్రమాణాలను అందుకోవాలని ఒత్తిడి చేశారనుకోండి అది అభిప్రాయబేధాలకే దారి తీయడమే కాదు మొత్తం పనితీరు మీదే ప్రభావం చూపుతుంది. కనుక ఎదుటి వారి విషయం పక్కన పెట్టి మనం చేసే పనిని సవ్యంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విషయాన్ని గ్రహిస్తే సమస్యే ఉండదు.