కొందరు మహిళలకు జట్టు పొడవుగా ఉండి నిగనిగలాడుతూ ఎంతో అందాన్నిస్తుంది. తోటి ఆడవాళ్ళు కూడా ఈర్ష్య పడే విధంగా ఆకట్టుకుంటుంది. అయితే అందరికీ అటువంటి అదృష్టం కలగదు అని వాపోతూవుం టారు. అందుకు నల్లగా నిగనిగలాడే పొడవాటి కురుల కోసం ఏం చేయాలంటే.. జుట్టు తత్వాన్ని బట్టి దువ్వెన వాడాలని బ్యూటీషన్లు చెబుతున్నారు.
తలను నెమ్మదిగా, నింపాదిగా దువ్వుకోవడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీనివల్ల కుదు ళ్ళు గట్టిపడతాయి. అయితే నేటి తరానికి అంత నింపా దిగా దువ్వుకునే తీరిక, ఓర్పు రెండూ వుండటం లేదు. అందుకే దువ్వే కొద్దిసేపైనా సరైన బ్రెష్‌ను ఎంచుకోవాలి. జుట్టు వున్నదానికంటే తిన్నగా కనిపించాలని కోరుకునే వారు వెడల్పాటి బ్రెష్‌ను ఉపయోగించాలి. ఉంగరాల్ని పెంచుకోవాలంటే లీవ్-ఇన్-కండిషనర్ ఉపయోగిం చాలి. అలాగే హెయిర్ డ్రయర్ కూడా. అయితే దీనిని తరచుగా వాడకూడదు. ఎక్కువుగా ఉపయోగిస్తే జుట్టంతా పొడిబారిపోతుంది. జుట్టు బలహీనంగా లేదా తక్కువుగా వున్నట్లయితే పళ్ళు బాగా దగ్గర దగ్గరగా వుండే బ్రెష్ ఉపయోగించాలి. స్ట్రెయిట్ జుట్టు ఉన్నట్లయి తే అదృష్టవంతులే. ఎటువంటి బ్రెష్ అయినా వాడుకో వచ్చు. జుట్టు ఊరికే చిక్కులు పడేవారు వెడల్పాటి పళ్ళు న్న బ్రెష్ వాడాలి. చిన్న చిన్న పళ్ళు మరింత దగ్గరగా వున్న బ్రెష్ వాడాలి. జుట్టు చిక్కులు త్వరగా విడిపోయేం దుకు వీలుగా వుండే ఉత్పత్తులు ఉపయోగించాలి. జుట్టు అదుపులో ఉండేందుకు కొద్దిపాటి నూనె అప్లయ్ చేస్తుండాలి. జుట్టును లేయర్ల మాదిరి కట్ చేసినట్ల యితే, దానిని ట్విస్ట్ చేసి, తడిపొడిగా వున్నప్పుడే బన్‌తో రోల్ చేసుకోవాలి. డ్రైయర్ నుంచి కొంత వేడిగాలితో డ్రై చేస్తే లేయర్లు మరింత స్పష్టంగా అందంగా కనిపిస్తాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇతరులను ఆకర్షించే విధమైన జుట్టు మీ సొంతం అవుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. రహస్యం తెలిసిపోయిందిగా ఇంక బ్యూటీపార్లర్ ఖర్చుపెట్టకుండా చెప్పింది చేయండి... రెండు విధాలా లాభపడినట్టే!