ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

UNCONDITIONAL HEAD MOVEMENT - HEAD DISORDER - TIPS AND DOCTOR'S ADVISE ON HEAD DISABILITY IN TELUGU


నవీన యుగంలో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య తలతిరుగుడు. దీనినే వైద్య పరిభాషలో ‘వర్టిగో’ అంటారు. ఈ సమస్యతో బాధపడేవారు ఒంటరిగా ఎటు వెళ్ళలేక భయపడుతుంటారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది కాని ఈ సమస్యను అనుభవించే వారి బాధ అంతా ఇంతాకాదు.. ఉదయం నిద్రలేవగానే మొదలవుతుంది. 


ఈ సమస్య నిద్ర నుంచి లేచి పక్కకు తిరిగినప్పుడు, రోడ్డు మీదికి వెళ్ళి నడుస్తున్నప్పుడు, ఆఫీసుల్లో కూర్చుని విధులు నిర్వహిస్తున్నప్పుడు ఉన్నట్టుండి తల తిరుగుతుంది. కొన్ని సందార్భాల్లో తూలిపడిపోవడం కూడా జరుగుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, లోలోన మదన పడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుకుంటే ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

కారణాలు:
1. అధిక రక్తపోటు, 
2. చెవి ముక్కు సమసయల వలన, 
3. మెడలోని ఎముకల అరుగుదల వలన., 
4. మెదడుకు అందాల్సిన ఆక్సీజన్‌ పరిమాణం తగ్గడం వలన తలతిప్పుతుంది.

లక్షణాలు:
  • నిద్ర నుంచి లేచినప్పుడు, ఒక పక్కకు తిరిగినప్పుడు ఉన్నట్లుండి తల తిప్పుతుంది.
  • తలతిప్పడంతో పాటు వాంతికి వచ్చినట్లుగా అనిపిస్తుంది.
  • ఒంటరిగా ఎటు పోవాలన్నా భయంగా ఉంటుంది.
  • కోపం, చిరాకు ఎక్కువగా ఉంటుంది.
  • తేలికగా ఆందోళన చెందుతుంటారు.

  • జాగ్రత్తలు:
  • తలతిప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ద్విచక్ర వాహనాల ప్రయాణం తగ్గించుకోవాలి.
  • ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి.
  • తగినంత విశ్రాంతి కోసం యోగ, మెడిటేషన్‌, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేయాలి.
  • సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడిని నివారించుకోవాలి.

    చికిత్స:
    తల తిప్పుడు సమస్య పోవటానికి హోమియో వైద్యంలో మంచి మందులున్నాయి. వ్యక్తి మానసిక లక్షణాలను శరీర లక్షణాలను మరియు వ్యాధి లక్షణాలను పరిగణలోకి తీసుకొని వైద్యం చేసినా తల తిప్పుడు సమస్యను తగ్గించవచ్చు.

    మందులు:
    కోనియం: 
    తల తిరుగుడు సమస్యకు కోనియం ప్రధానమైన ఔషధం. మంచంలో పడుకొని ఉన్నట్లయితే గది మొత్తం తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తల అటు, ఇటు తిప్పినా కూడా గదిలో వస్తువులు గుండ్రంగా తిరుగున్నట్లుగా ఉంటుంది. అలాగే కదిలే వస్తువులను చూసినా, వర్టిగో సమస్య ఉత్పన్నమవుతుంది. నడిచేటప్పుడు కాళ్ళు తడబడతాయి. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.

    కాకుయలస్‌ ఇండికస్‌ : బస్సు, కారు, రైలు ప్రయాణాలు చేసినప్పుడు వాంతులతో పాటు తలతిరుగుతున్నట్లుగా అనిపించే వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
    సైలీషియా : వీరు పైకి చూసినా, కదిలినా, కళ్ళు మూసుకున్నా ‘వర్టిగో’ సమస్యతో తూలుతూ ఉంటారు. వీరు కుడివైపుకి తిరిగి పడుకున్నప్పుడు వర్టిగో సమస్య అధికమవుతుంది. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.ఇలా మందులను లక్షణ సముదాయంను పరిగణలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల వర్టిగో సమస్యను నివారించవచ్చు.