అరటిపండు మనకి సర్వసాధారణంగా అన్ని రోజుల్లోనూ దొరుకుతుంది. అయితే దీన్ని కేవలం శుభకార్యాలకే పరిమితం అనుకుంటే పొరపాటే, ఋతువులతో సంబధం లేకుండా ఏడాది పొడవునా లభ్యమయ్యే ఈ అరటి పండులో పోషక విలువలు చాలా ఉన్నాయి.
ఇందులో 105 కాలరీల శక్తినిచ్చే గుణం ఉంది. విటమిన్ బి6, పీచుపదార్దం 3 గ్రాములు, ఫాలెట్, పొటాషియం పుష్కలంగా ఉండి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనేక సమస్యల్ని ఎదుర్కునే మహిళలకి ఇది ఎంతో మంచి పౌష్టికాహారం అని చెప్పవచ్చు. ఎంతో మధురంగా ఉండే ఈ అరటి పండుతో మరిన్ని పండ్ల ముక్కలు చేర్చి తీసుకుంటూ ఉంటే, అధిక శాతంలో పొటాషియం లభ్యమయ్యి లోబ్లెడ్ ప్రెషర్ని అరికట్టి, రక్తం ప్రసరణ సవ్యంగా జరిగేటట్టు చేస్తుంది. ప్రతి అరటి పండులోను 422 మిల్లీగ్రాముల పొటాషియం లభ్యమవుతుంది. రబ్బరుపాల ఉత్పత్తుల కర్మాగారంలో పనిచేసేవారికి ఆ పాల వల్ల కలిగే అలర్జీకి అరటిపండు ఎంతో దివ్యౌషధం అన్న విషయం ఎంతమందికి తెలుసు! అందుకే పనికిరాని చిరుతిళ్ళు మాని దానికి బదులు అరటి పండ్లు తినడం మొదలు పెట్టండి. సంవత్సరం వచ్చిన చంటిపిల్లలకి కూడా ఆహారంలో అరటిపండుని గుజ్జులా కలిపి పెట్టమని డాక్టర్లు సలహాయిస్తూంటారు.