కావలసిన పదార్థాలు
సేమ్యా - అర కిలో
చికెన్ - పావు కిలో
నూనె 2 టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
ఉప్పు - తగినంత
కారం - టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
పుదీనా తరుగు - 1 స్పూన్
కొత్తిమీద తరుగు - 1 స్పూన్
సాజీరా - 1స్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
కుంకుమ పువ్వు - చిటికెడు
తయారీ విధానం
కుక్కర్‌లో రెండు టీ స్పూన్లు నూనె, సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ వేసి ఉడికించాలి. సేమ్యాను విడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో నూనె వేడిచేసి సాజీరా, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా వేయించాలి.అందులోనే ఉడికించిన చికెన్ కలపాలి. కుక్కర్‌లో ఒక పొర ఉడికించిన చికెన్, మరో పొర ఉడికించిన సేమ్యా, మళ్లీ ఉడికించిన చికెన్, దానిపైన సేమ్యా ఇలా సర్దాలి. అరకప్పు పాలలో కుంకుమ పువ్వు కలిపి ఈ పాలను పైన తయారు చేసుకున్న మిశ్రమం మీద మీద చిలకరించి మూత పెట్టాలి. దీన్ని ఉడికించితే సేమ్యా చికెన్ పులావ్ రెడీ.