మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యా నికి ఎంతోమేలు చేస్తుంది. దీనిని సాధార ణంగా జొన్నలని కూడా అంటారు. ఈ మొక్కజొన్న గింజలను వివిధ రకాలుగా వండుతారు. కండెలుగా వున్నప్పుడే వాటిని తీపివిగా తినేయ వచ్చు. లేదా వాటికి మసాలాలు, కారాలు కూడా తగిలించి తింటారు. గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తినవచ్చు. లేదా ఉల్లిపాయ, పచ్చి మిర్చీ వంటి వాటితో కూడా చేర్చి సాయంకాలం వేళ మంచి చిరుతిండిగా తినేయవచ్చు. మొక్కజొన్న కండెలను సాధారణంగా మనం నిప్పులపై వేడిచేసి బాగా కాలిన తర్వాత తింటాం. లేదా కాల్చిన మొక్కజొన్న కండెలకు వివిధ కారాలు, ఉప్పులు రాసికూడా తినేస్తాం. మొక్కజొన్న తినటం రుచే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
మొక్కజొన్న కండెలలోని ఆరోగ్య ప్రయోజనాలు:
1.జీర్ణక్రియను పెంపొందిస్తుంది. మొక్కజొన్నలో పీచు పుష్కలంగా వుంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.ఆహారంలో పీచు వుంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ అరికడుతుంది.
2.మొక్కజొన్నలో కావలసినన్ని లవణాలు లేదా మినరల్స్ వుంటాయి. పసుపురంగులో వుండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అధికం. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా వీటిలో వుండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. మీ ఎముకల విరుగుట అరికట్టటమేకాక, మీరు పెద్దవారయ్యే కొద్ది కిడ్నీలను కూడా ఆరోగ్యంగా వుంచుతాయి.
3.చర్మ సంరక్షణ-మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా వుంచి ఎప్పటికి చిన్నవారుగా కనపడేలా చేస్తాయి. మొక్కజొన్న గింజలు తినటమే కాక, ఈ విత్తనాల నూనె కనుక చర్మానికి రాస్తే, దీనిలో వుండే లినోలె యాసిడ్ చర్మమంటలను, లేదా ర్యాష్‌లను కూడా తగ్గిస్తుంది.
4. రక్తహీనతను అరికడతాయి. రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్తకణాల సంఖ్య ఐరన్ లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది. మరి మీరు తినే స్వీట్ మొక్కజొన్న విటమిన్ మరియు ఫోలిక్ యాసిడ్‌లు కలిగి మీలో రక్తహీనత లేకుండా చేస్తుంది.
5.కొల్లెస్టరాల్ నివారణ చేస్తాయి. శరీరంలో లివర్ కొలెస్టరాల్‌ను తయారు చేస్తుంది. రెండు రకాల కొలెస్టరాల్ తయారవుతుంది. అవి హెడ్‌డిఎల్ మరియు చెడు కొలెస్టరాల్ అయిన ఎల్‌డిఎల్. నేటి రోజులలో కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్టరాల్‌ని పెంచి గుండెను బలహీనం చేసి గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తున్నాయి. తీపి మొక్కజొన్నలో వుండే విటమిన్ సి, కేరోటియాయిడ్లు మరియు మయో ప్లేవినాయిడ్లు మీ గుండెను చెడు కొలెస్టరాల్ నుండి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికం చేస్తాయి.
6.గర్భవతులకు ఈ ఆహారం ప్రధానం-గర్భవతి మహిళలు తమ ఆహారంలో మొక్కజొన్న తప్పక కలిగి ఉండాలి. దీనిలో వుండే ఫోలిక్ యాసిడ్ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్ యాసిడ్ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్కజొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే.
కనుక మీ ఆహారంలో తగినంత మొక్కజొన్న ఆహారం చేర్చి తినండి. దానివలన వచ్చే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. వివిధ రోగాలను తగ్గించుకోండి. ఆరోగ్యంగా ఉండండి.