ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU ARTICLE ON BLOOD - BRIEF FACTS IN TELUGU



''నాకే రక్తం లేదు. నేనెలా రక్తమిస్తాను ?'' అని రక్తదాన మంటే భయపడే వాళ్ళు చెప్పే మొదటి మాట. రక్తం గురించి కొంత అవగాహన ఉంటే ఆమాట రాదు. ప్రతి జీవికి రక్తం ఉం టుంది. అయితే వెన్నెముకగల జంతువులలో రక్తం ఎరుపు రంగులోను, వెన్నెముకలేని ప్రాణులలో మూడు రంగులలో వుంటుంది. తేలు. జెర్రి'బొద్దింక' మగ దోమలలో తెలుపు రంగు, నత్త పీత కొన్ని రకాల కీటకాలు, సముద్ర జలచరాల్లో నీలం రంగులోను,పేను, నల్లి, జలగ,ఆడ దోమలలో నలుపు రంగులోను ఉంటుంది. సాధారణంగా మనుషులలో 4 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది. పురుషులలో ఒక కిలో బరువుకు 76 మి.లీ.లు స్త్రీలలో ఒక కిలో బరువుకు 66 మి.లీ. రక్తం ఉంటుంది. ఎవరికైనా అవసరానికి మించి ఒక లీటరు రక్తం స్పేర్‌గా ఉంటుంది. ప్రమాదాలలో ఒక లీటరు రక్తం పోయినా మానసికంగాధైైర్యంగా ఉంటే ప్రాణాపాయం ఉండదు. ఒకలీటరు కన్నా ఎక్కువ రక్త స్రావం జరిగితే24 గంటలలోగా రక్తం ఎక్కిస్తే ప్రాణగండం తప్పినట్లే. రక్తదాన ప్రక్రియలో కేవలం 350 మి.లీ. (స్పేర్‌గా ఉండే 1,000 మి.లీ. రక్తంలో మూడవ వంతు మాత్రమే) రక్తాన్ని తీసుకుంటారు. ఒకే సారి 700 మి.లీ. రక్తం ఇచ్చిన దాతలు ఎందరో ఉన్నారు. అందుకు కారణం వాళ్ళల్లో నున్న మనోబలమే.అమెరికాలో స్థిరపడిన కర్నూలు జిల్లాకు చెందిన డా|| సుశీలా రెడ్డి 210 సార్లు, మద్రాసు (రాయపురం) వాస్తవ్యులు రాజశేఖర్‌ 162 సార్లు కడపజిల్లా ప్రొద్దుటూరు నివాసి వర్రా గురివి రెడ్డి 127 సార్లు రక్తదానం చేసినా రంటే కారణం వాళ్ళల్లో వున్న మనోబలమే. రక్తం గురించి ఇతిహాసాలలోను, చరిత్రలోను, కావ్యాలలోను ప్రస్తావించటం జరిగినది. 

భీముడు దుశ్శాసనుని చంపి రక్తం తాగుతానని శపథంచేసి నెరవేర్చుకున్నాడని మహాభారతంలో ఉన్నది. పూర్వం రోమన్లు బలం కొరకు మనుషుల రక్తం త్రాగేవారట. ఈజిప్టు దేశాలలో రాణులు అందం పెరుగుతుందనే నమ్మకంతో బానిసల రక్తం కలిపిన నీళ్ళతో స్నానం చేసేవారట.యూరపు దేశాలలో సత్ప్రవర్తన కలిగిన వారి నుండి రక్తాన్ని తీసి ఖైదీలకు ఎక్కించేవారట. ప్రవర్తనలో మార్పువస్తుందనే నమ్మకంతో. షేక్‌ స్పియర్‌ తన మర్చంట్‌ ఆఫ్‌ వెనీస్‌ కావ్యంలో పతాక సన్నివేశానికి మలుపు తెచ్చేది రక్తపు చుక్కలే. రక్తం త్రాగే డ్రాకులా కథలు కోకొల్లలుగా సృష్టించబడినాయి. రక్త సంబంధపు వ్యాధులకు జలగల ద్వారా రక్తాన్ని తీయడం చికిత్సా విధానాలలో ప్రధానంగా ఉండేది. యుద్ధభూమికి వెళ్ళే వీరులకు రక్తతిలకాలు దిద్దేవారు.

 కొన్ని ఆదివాసి తెగల వధూవరుల అరచేతులకు గాట్లు పెట్టి కరచాలనంతో పెళ్ళి తంతు జరిపేవారు. అతిగా అభిమానించేవా, ప్రేమించేవారు రక్తాక్షరాలతో ఉత్తరాలు వ్రాయడం తరచుగా జరుగుతూ ఉంటాయి. ఆది మానవుడి నుండి నేటి వరకు ప్రతి మనిషి రక్తాన్ని రుచి చూడడం జరిగి ఉంటుంది. చేతి వేలికి చిన్న గాయమై రక్తం కనబడితే వెంటనే నోట్లో పెట్టుకోవడం అసంకల్పిత ప్రతీకారచర్యగా జరుగుతుంది. రక్తం కూడా సందర్భానుచితంగా ఎన్నెన్నో అవతారాలు ఎత్తుతుంది. నేర పరిశోధనలో అంతు చిక్కని ఎన్నెన్నో రహస్యాలను ఛేదించి దోషులకు శిక్షపడేటట్లు చేస్తుంది. కొన్ని రక్తపరీక్షల వలన అంటే ఇక్కడ పత్తేదారు అవతారం. అంతు చిక్కని కొన్ని వ్యాధులను రక్తపరీక్షల ద్వారా తెలుసుకుంటాం. ఇక్కడ వైద్యావతారం .తల్లి వాస్తవం- తండ్రి నమ్మకం'' అని నానుడి అందరికి తెలిసినదే. 

కాని కొన్ని విచిత్ర సంఘటనలలో తల్లికూడా అపనమ్మకమని సందేహించినపుడే డి.ఎన్‌.ఎ పరీక్షల్లో రక్తం వాస్తవాన్ని వెల్లడిస్తుంది. ఇక్కడ జడ్జీ (న్యాయాధిపతి) గా అవతారం. యుక్త వయసు నుండి మోనోపాజ్‌ వరకు స్త్రీ గర్భసంచిలో సంతాన ప్రక్రియ కొరకు ఓవమ్‌ ఏర్పడటం సహజం. గర్భధారణ జరగకపోతే ఆ ప్రాణం ఉన్న ఓవమ్స్‌ చనిపోవడం కూడా అంతే సహజం. ఆ చనిపోయిన ఓవం అలానే గర్భసంచిలోనే ఉంటే ప్రమాదం కావున సుమారు 100మి.లీ. రక్తం ఆ గర్భసంచిని శుభ్రపరుస్తుంది. ఇక్కడ రక్తం సానిటరీ ఇన్‌స్పెక్టరుగా అవతారం. తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పటి నుండి ప్రసవించేంత వరకు తల్లి ఆ బిడ్డకు ఆహారంగా (టవ్‌బర) మూడు లీటర్ల రక్తాన్ని అందిస్తుంది. ఇక్కడ పంచభక్ష పరమాన్నావతారం. సుఖ ప్రసవంలో రక్తమే ప్రధాన పాత్ర వహిస్తుంది. సుమారుగా 700మి.లీ. రక్తం బిడ్డను బయటకు తీసుకొని వస్తుంది. రక్తం తక్కువవున్న గర్భిణీలకు రక్తం ఎక్కిస్తే గాని సుఖ ప్రసవం జరగదు. కావున ఇక్కడ రక్తం గైనకాలజిస్టుగా అవతారం. ఇలా ఎన్నెన్నో అవతారాలెత్తే రక్తంలోని భాగాలను గురించి కూడా కాస్తంత తెలుసుకుందాం. రక్తం చూచేందుకు నీరులాగా ద్రవరూపంలో ఉన్నా నీటి కన్నా ఆరు రెట్లు చిక్కగా ఉంటుంది.

 రక్తంలో ప్రధానంగా నాలుగు భాగాలుంటాయి. 

1.ప్లాస్మా, 2. ఎర్ర రక్త కణాలు (తీbష ) 3. తెల్ల రక్త కణాలు (షbష) 4. రక్తఫలికికలు (జూశ్రీa్‌వశ్రీవ్‌ర) 

భూగోళంలో నీరు మూడువంతులున్నట్లుగానే రక్తంలో కూడా 55శాతం ప్లాస్మా (ద్రవరూపం) ఉంటుంది. అందులో కూడా 92 శాతం నీరు, 8శాతం ఉప్పు మరి కొన్ని పోషక పదార్థాలు వుంటాయి. ''నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు'' అను నానుడి అందరికి తెలిసినదే. రక్తం కూడా ద్రవరూపమే అయినా ఆ నానుడి రక్తానికి వర్తించదు. అయితే రెండు సందర్భాలలో తప్ప. గుండె ఒక మోటారు పంపులాగా నిత్యం పంపు చేస్తుంటుంది. కిందికి పైకి ప్రవహిస్తూనే వుంటుంది.గంటలో 36వేల లీటర్ల రక్తాన్ని 20వేల కిలోమీటర్ల దూరం ప్రవహింపజేస్తుంది.


ఒక రక్తపు చుక్కలో తీbష 25కోట్లు షbష 4లక్షలు. ప్లేట్‌ లెట్సు1 కోటి 50 లక్షలుంటాయి. ఈ మూడింటిలో ఎక్కువశాతం ఎర్రరక్తకణాలే కావున రక్తం ఎరుపు రంగులో వుంటుంది. బండికి పెట్రోలు ఎంత అవసమో మనిషికి తీbష అలా పనిచేస్తుంది. దేశానికి సైన్యం ఎంత అవసరమో మనిషికి షbష అలా పనిచేస్తుంది. గాయం ఏర్పడితే అధిక రక్తస్రావం జరగకుండా గడ్డకట్టుకునేందుకు సాయపడేవి ప్లేట్‌లెట్స్‌.