ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TOMATO URAGAYA PICKLE - SUMMER SPECIAL


టమోటా అంటే ఇష్టం లేదని ఎవ్వరంటారు. ఎర్రగా దోరగా నిగనిగలాడుతూ చూడగానే ఇట్టే ఆకట్టుకుంటుంది. కొందరు వండేదాక ఆగడమా అంటూ అలాగే తినేస్తారు. దీనితో చేయని వంటకం లేదు. కూర, చారు, పప్పు, పచ్చడి , జామ్‌, జ్యూసు, కెచప్‌, సాస్‌-ధరకూడా అందుబాటులోనే ఉంటుంది. మరీ టమోటో ఊరగాయతో కొంచెం వెరైటీ టేస్ట్‌ రుచి చూద్దాం. టమోటోను తీసుకోవడం వల్ల ప్రయోజనాలేంటో చూద్దాం.. టమోటాల్లో క్యాల్షియం, పాస్పరస్‌, విటమీన్‌ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్త్తే ఉపశమనం కలుగుతుంది. టమోటాలో సిట్రిక్‌ ఆమ్లం ఉండడంతో ఎసిడిటీ దూరమౌతుంది.

టమోటాల్లో విటమిన్‌ ఎ అధికంగా ఉండడంతో కంటి జబ్బులు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్‌ తగ్గుతుంది. రోగ నిరోధక టమోటా తక్కువ కేలరీలు గల టమోటాలు చర్మం, కళ్ళకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని విటమన్‌ ఏ, విటమిన్‌ సి రోగ నిరోధక శక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7శాతం వరకు లభిస్తుంది. వీటికి ఎర్రటి రంగుతెచ్చిపెట్టే లైకోపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌, ఇది ఊపిరి తిత్తులు,రొమ్ము, ఎండో మెట్రియల్‌ క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంతో సాయం చేస్తుంది.

కావలసిన పదార్థాలు: 

టమోటాలు -1/2కెజీ నూనె : 1/4 టీ స్పూను,కారం : 1/2 కప్పు, ఉప్పు: రుచికి సరిపడా, మెంతులు -1/2 టీస్పూను, నూనె : సరిపడా, ఆవాలు: 3 టేబుల్‌ స్పూన్లు, చింతపండు: కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు :8-10

తయారు చేయు విధానము : 

ముందుగా టమోటాలు నీటిలో వేసి శుభ్రం చేసి, ప్లేటులోనికి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత పొడిబట్టతో తుడిచి తేమను పూర్తిగా తొలగించి, సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తర్వాత పాన్‌లో నూనెవేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి చితగ్గొట్టి దోరగా వేయించుకోవాలి. వెంటనే అందులో టమోటో ముక్కలు,చింతపండును వేయాలి. తక్కువ మంట మీద టమోటాల్లోని తేమంతా పూర్తిగా పోయేదాకా బాగా మగ్గించాలి.ఇప్పుడు మెంతుల్ని దోరగా వేయించి, మెత్తగా పొడిచేసుకోవాలి. మెంతి పొడి తగినంత
ఉప్పుకారం, కలిపి మరో ఐదు నిమిషాలుంచాలి. వాటితో టమోటో బాగా గట్టి పడుతూ మగ్గిన తర్వాత దింపి ముందు ఆవపిండిని కలిపితేసరిపోతుంది. నోరూరించే ఇన్‌స్టెండ్‌ టమోటో ఊరగాయ రెడీ. ఇది ఒక వారం రోజులు పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పదిహేను రోజులు కూడా నిల్వ ఉంటుంది.