సాధారణంగా చాలా మంది ముఖంలో మొటిమలతో ఇబ్బంది పడుతుంటారు. మొటిమలు అన్ని వయస్సులవారు ఎదుర్కొంటున్న సాధారణ చర్మ సమస్య. ముఖ్యంగా టీనేజర్స్ లోనూ పెద్దవాళ్ళలో ఎక్కువగా కనబడే చర్మ సమస్య. ఈ మొటిమలు సాధారణంగా వాతావరణ కాలుష్యం వల్ల చర్మం మీద దుమ్ము, ధూళి చేరడం వల్ల, జిడ్డు చర్మం, బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ వల్ల కూడా మొటిమలు రావడానికి కారణం అవుతుంది. ముఖం మీద కానీ, లేదా శరీరంలో ఏ ఇతర భాగాల్లో ఎరుపు రంగు మచ్చలు ఏర్పడటానికి వివిధ కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు సెబాసియస్ గ్లాండ్స్ (నూనె గ్రంథులు ) ఎక్కువగా ఉండడం చేత కూడా ముఖం మీద మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతాయి. ఇంకా హార్మోనుల అసమతుల్యత మరియు అనారోగ్యక రమైన ఆహారం, దుమ్ము మరియు సూర్యరశ్మి వంటి ఇతర సాధారణ కారణాలు కూడా మొటిమలు ఏర్పడటానికి కారణం కావచ్చు.
మొటిమల నివారణకు చాలా చికిత్స పద్ధతులున్నాయి. అయితే మొటిమలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది. చాలా వరకూ మొటిమల నివారణలో చికిత్స పద్ధతుల్లో రసాయనాలు అధికంగా వాడడం వల్ల ఒక సమస్యకు మరో సమస్యతోడవుతుంది. కాబట్టి రసాయన క్రీములు వాడటం కంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించి చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవి ఖచ్చితంగా మీ వంటగదిలోనే సులభంగా దొరికేటటువంటి వస్తువులతోనే మొటిమలు నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆలివ్ ఆయిల్, లవంగాలు లేదా తేనె వంటివి ప్రతి ఇంట్లోను నిల్వ ఉంటాయి. కాబట్టి మీరు సహజ పద్ధతుల ద్వారా మొటిమలు నివారించు కోవాలంటే ఇటువంటి కొన్ని వంటింటి వస్తువుల ను ఉపయోగించండి. మొటిమల నివారణలో ఉపయోగపడే కొన్ని వంటగది వస్తువులు....
నిమ్మరసం: మొటిమల నివారణకు సిట్రస్ పండ్లు బాగా సహాయపడుతాయి. నిమ్మరసాన్ని కానీ లేదా తాజా నిమ్మ చెక్కతో కానీ మొటిమలున్న ప్రదేశంలో మసాజ్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని స్తుంది. అంతే కాదు మీరు రెగ్యులర్‌గా ఉపయోగించే ఫేస్ ప్యాక్స్‌లో నిమ్మరసాన్ని కూడా కలిపి ఉపయోగించుకోవచ్చు.
తేనె: చర్మ సంరక్షణలో మనం తరచూ తేనెను ఉపయోగిస్తుంటాం. చర్మం నునువుగా, సున్నితంగా, టైట్‌గా మారడానికి మాయిశ్చరైజింగ్‌గా ఉపయో గిస్తుంటాం. తేనెలో యాంటీయాక్సిడెంట్స్ కలిగి ఉండటంవల్ల చర్మాన్ని శుభ్రం చేసి మొటిమలను నివారిస్తుంది.
ఓట్ మీల్: ఓట్ మీల్ చర్మం పెలుసుబారకుండా చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది. ముఖ్యం గా మొటిమలతో వచ్చిన మచ్చలను తగ్గిస్తుంది. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు ఓట్ మీల్‌ను పాలతో కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి.
బేకింగ్ సోడా: ఇది నేచురల్ క్లీనర్‌గా పనిచేస్తుంది. బేకింగÊ సోడాతో మొటిమల మీద మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాన్నిస్తుంది. ఇది మొటిమలను నివారించడమే కాకుండా ముడతల ను తొలగిస్తుంది.
టమోటో: టమోటోలో విటమిన్ ఎ మరియు సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల సెరమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సీరం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల కూడా మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ వంటింటి వస్తువు టమోటోతో ముఖాన్ని మసాజ్ చేయండి.
సీ సాల్ట్: మొటిమల నివారణకు నిమ్మరసం, సీసాల్ట్ బెస్ట్ ఫేస్ స్క్రబ్ . సీ సాల్ట్ చర్మాన్ని శుభ్రపరిచి, మొటిమలను పోగొడుతుంది.
అలోవెరా: ఇది వంటింటి వస్తువు కాదు. అయిన ప్పటికీ దీన్ని సాధారణంగా మన ఇళ్ళల్లో పెంచు కుంటుంటాం. కాబట్టి దీన్ని ఉపయోగించి మొటిమలను నయం చేసుకోవచ్చు. అలోవెరా జెల్‌ల్లో యాంటీఇన్ల్పమేటర్ గుణాలు మెండుగా ఉండటం వల్ల మొటిమల నివారణకు బాగా సహాయపడుతుంది.