ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

100% WATER





నిత్యవాడకంలో నీరు ప్రధాన పాత్ర వహిస్తున్నది. మనం తినే ఆహారం ఉడకటానికి నీరు ఎంతో తోడ్పడుతుంది. మనం నీటికి త్రాగుతున్నాం. నీరు శరీరానికి చాలా అవసరం. అందుకనే నీటిని త్రాగుతాం. శరీరం బరువులో మూడింట రెండువంతుల నీరు ఉన్నది. ఉదజని (రెండువంతులు ) ప్రాణవాయువు (ఒక వంతు) కలిసి నీటిలో ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మనం త్రాగేనీరు రక్తంతోపాటు ఇతర ద్రవాల తయారీలో తోడ్పడు తున్నది. మనం త్రాగిన నీరు జీర్ణనాళంలోకి వెళుతుంది కదా! అప్పుడు చిన్న,పెద్ద ప్రేవుల ద్వారా రక్తంలోనికి పీల్చబడుతుంది. అంటే రక్తానికి నీటి అవసరం ఎంతో ఉం దన్నమాట రక్తంలో 'ప్లాస్మా' అనే ముఖ్యమైన ద్రవం ఉన్నది కదా! దీనిలో 90శాతం ఉన్నది నీరే! ప్రతి జీవి కణాలలోను, కణాల వెలుపల నీరు ఉంటుంది. పెరిగే వయస్సులో కణజాలాల నిర్మాణం కావటానికి నీరు ఎంతో అవసరం. మనం తీసుకొనే మాంసకృత్తులతో రసాయనికంగా కలిసి పోతుంది. కణజీవ ద్రవ్యంలో ఉన్న పదార్థాలతో చేరుకుంటుంది. మాంసకృత్తులు. జీవక్రియ తర్వాత ''యూరియా''గా రూపాంతరము చెందుతాయి. ఆ యూరియాను నీరే మూత్రరూపంలో బయటకు పంపుతుంది.జీర్ణకోశంలో పోషకాలు విచ్ఛిత్తి కావటానికి నీరే ఆధారం.తరువాత అవయవాలకు పోషకాలు సరఫరా కావటానికి తోడ్పడుతుంది.మనం తినే ఆహారం నోట్లో ముద్దగా మారటానికి నీరే ఆధారం. ఆ ముద్ద జీర్ణకోశంలోనికి వెళ్ళటానికి నీరు సహాయం చేస్తుం ది. దేహంలో 'అయోనీకరణ' జరుగుతుంది. దానికి తోడ్పడేది నీరే! రోజూ పెద్దవాళ్ళకు 2 నుండి 21/2 లీటర్లు నీరు కావలసి వుంటుంది. వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ నీరు తాగుతారు. మనకు నీరు సమపాళ్ళలో కావాలి. ఎక్కువైనా ప్రమాదమే! తక్కువైనా ప్రమాదమే!