ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AGE OLD PEOPLE - NO SLEEP DISEASE - FACTS AND FIGURES - AN ARTICLE FOR OLD PEOPLE'S PROBLEMS




వృద్ధాప్యంలో నిద్రపట్ట కపోవడం మనేది సర్వసాధా రణం ఒక రకంగా చెప్పాలంటే నిద్రతగ్గిపోవడం వృద్ధాప్యంలో భాగంగా కూడా చెప్పవచ్చు. అయితే కేవలం వృద్ధాప్యం కారణంగానే తక్కువ సమయం నిద్రపడుతుందనే భావన కూడా నిజం కాదు. జీవితం ఎదురైన ప్రతికూల పరిస్థితులు. కష్టాలకు సంబంధించిన ఆలోచనలు నిద్రలేకుండా చేయవచ్చు. లేదా ఖాళీ సమయం ఎక్కువగా వుండటం వల్ల పగటిపూట నిద్ర ఎక్కువగా పోవడం వల్ల కూడా రాత్రివేళ నిద్రతగ్గిపోయే అవకాశం ఉంటుంది. మొత్తంగా యువకులు, మధ్యవయస్కులతో పోల్చుకుంటే వృద్ధులలో నిద్రపట్టని సమస్య ఎక్కువగా వుండటాన్ని పరిశోధకులు గుర్తించారు.

- వృద్ధులు చెప్పే సమస్యలలో ప్రధాన సమస్య వెంటనే నిద్రపట్టకపోవడం, ఒకవేళ పట్టినా వెంటనే మెలకువ రావడం.
- రోజు మొత్తంలో మంచంపై ఎక్కువ సమయం వున్నప్పటికీ నిద్రపట్టే సమయం తక్కువగా వుండటం. - తెల్లవారు జామున మూడు, నాలుగు గంటలకే మెలకువ రావడం, ఆ తర్వాత నిద్రపట్టకపోవడం.నిద్రపట్టినా, విశ్రాంతి తీసుకొన్నట్టుగా అనిపించకపోవడం. - రాత్రి సమయంలో చాలా పెందలాడే నిద్రపోవాలనిపించడం, తెల్లవారు జామునే మెలకువ రావడం.
పగటి పూట అలసటగా, నిస్సత్త్తువగా వుండటం. - తగినంతగా నిద్రపట్టకపోవడం వల్ల కంటి సమస్యలు తలెత్తడం. అమెరికాలో పెద్దవయసు గల 150 మంది స్త్రీ, పురుషులను ఎంపిక చేసి నిద్రపై అధ్యయనం చేసి, యుక్తవయసువారితో పోల్చినపుడు కొంతమందిలో అతిగానిద్రపోవడం, మరికొంతమందిలో చాలా తక్కువ సమయం నిద్రపోవడం, నిద్రపోయే సమయం క్రమంగా తగ్గిపోవడం వంటి పలు అంశాలను గుర్తించారు. ఆరోగ్యంగా వున్న పెద్దవయసువారిలో కూడా 65శాతం మందికి నిద్రపోయే సమయం తగ్గిపోవడం, నిద్రపోయే సామర్థ్యం తగ్గిపోవడం, ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ ( తీవఎ) తగ్గిపోవడం అంటే నిద్రపోయిన వెంటనే కనుపాపల కదలికశాతం, కదలిక సామర్థ్యం తగ్గిపోవడం గుర్తించారు.దీనికి ప్రధాన కారణం. సరిగా నిద్రపట్టడం లేదని చెప్పేవారు పగటిపూట విధి నిర్వహణలో తగిన విధంగా సామర్ధ్యం చూపలేకపోవడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. సహజంగానే 60 నుంచి 80ఏళ్ళలోపు వయసు వారిలో రాత్రివేళ మధ్యమధ్యలో మెలకువరావడం, త్వరగా మెలకువరావడం వంటి లక్షణాలు వుంటాయి. ఈ కారణంగా నిద్రపోయే సామర్ధ్యం క్రమంగా తగ్గిపోతుంది. 50 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి సెంటర్‌న సర్వ్‌స్‌ సిస్టమ్‌లోనే మార్పు ప్రారంభమవుతుంది. దాదాపు 85 సంవత్సరాల వయసు వచ్చే సరికి దాదాపు 50శాతం ఈ సిస్టమ్‌ మార్పునకు గురికావడం వల్లనే నిద్రసమస్యలు తలెత్తుతాయని అధ్యయనం ద్వారా నిర్ణయానికి వచ్చారు.



వయసు పెరగడంతోపాటు శరీరంలో నిద్రకు సంబంధించిన వ్యవస్థలో కూడా అనేక మార్పులు వస్తాయి. నిద్రలో కాళ్ళు కదల్చటంతోపాటు ఆరోగ్యసమస్యలు, మానసిక సమస్యలు వస్తాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ సమస్యలతోపాటు నిద్రలో శ్వాససంబంధమైన సమస్య కూడా తలెత్తడాన్ని గుర్తించారు. ఈ సమస్యలతోపాటు ఆల్‌జీమర్‌ వ్యాధి తరహాలో నిద్రపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం కూడా వుంది. నిద్రపట్టక ఇబ్బంది పడే వృద్థులవిష యంలో కుటుం బ సభ్యులు ఈ విషయాలను గమనించడం అవసరం వృద్ధా ప్యం వచ్చిన తర్వాత వివిధ అనారో గ్య కారణాల వల్ల మందుల వాడకం తగ్గి పోయి ఖాళీగా వుండే సమ యం పెరుగు తుంది. శారీరక కష్టం వున్నపుడు అదే స్థాయిలో నిద్ర సామర్థ్యం వుంటు ంది. పనిచేయడం తగ్గిపోతే నిద్రపోయే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అలవాటుకు భిన్నంగా ఆరుబయట పడుకోవడం, రాత్రి సమయంలో లైట్లు వెలుగుతూ ఉండడం వంటి కారణాల వల్లకూడా నిద్రపరంగా సమస్యలు తతెత్తుతాయి. కొంతమందికి వృద్ధాప్యం వచ్చినా కుటుంబ బాధ్యతలు తొలగిపోకపోవడం, ఆర్ధిక సమస్యలు వంటి అంశాలు కూడా నిద్రలేకుండా చేస్తాయి.
చికిత్స: వృద్ధులకు చికిత్స చేయడం ప్రారంభించడానికి ముందు పైన తెలిపిన అన్ని కోణాలలో క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి వుంటుంది. పైన చర్చించిన అన్ని రకాల అంశాలను పరిగణ లోకి తీసుకొని చికిత్స చేయాల్సి వుంటుంది. సహజంగా వృద్ధులకు ఇతరత్రా కారణాల వల్ల కూడా మందులు వాడుతుంటారు. అటువంటప్పుడు నిద్రకు సంబంధించి కూడా మందులు వాడాల్సి వచ్చినప్పుడు ఇతర అనారోగ్య సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది. అందువల్ల సమీకృత చికిత్సా విధానం అవలంభించాల్సి వుంటుంది. కొన్ని సమయాలలో అసలు మందులు వాడకుండా బిహేవియర్‌ థెరపీ విధానంలో కూడా సమస్యను అధిగమించవచ్చు.

ఇతరత్రా రుగ్మతలు లేకుండా కేవలం నిద్రపరమైన చికిత్స మాత్రమే చేయాల్సి వచ్చినపుడు ''బైట్‌ లైట్‌'' వంటి అనేక అ ధునాతన విధానాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.